ఆంధ్రప్రదేశ్‌

మా లెక్కలు మాకున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: ఎన్నికల్లో గెలుపు టీడీపీదేని, తమ లెక్కలు తమకు ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్ప వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయం వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా 115 నుంచి 120 సీట్లలో గెలుస్తామన్నారు. రాష్ట్రంలో శాంతిభత్రలకు విఘాతం కల్గిస్తోంది వైకాపా అని, ప్రతిపక్షమే సమస్యలు సృష్టిస్తూ శాంతిభద్రతలు సరిగా లేవని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని సొంత కుటుంబ సభ్యులే హత్య చేసి, కావాలని శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైకాపా శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడ్డాయన్నారు. వైకాపాపై ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వంపైనే నిందలు వేస్తుందన్నారు. ఈవీఎంల్లో సమస్యలు తలెత్తినా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి, ఒటు వేశారన్నారు. పోలింగ్ నిర్వహణలో ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ కేర్ టేకర్‌గా ఉన్న ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, ప్రజల సమస్యలపై సమీక్షలు చేయవచ్చని వివరించారు. సమీక్షలు చేయకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. ఇంటెలిజెన్సు డీజీ, ఎస్పీలను అకారణంగా బదిలీ చేశారని, ఉద్దేశ్యపూర్వకంగా బదిలీ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేశారు. టీడీపీ చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమని గెలిపిస్తాయన్నారు.