ఆంధ్రప్రదేశ్‌

సీఎం సమీక్షలపై సీఎస్ వివరణ కోరతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: ఉండవల్లి ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)ని నివేదిక కోరనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు 600 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో గురువారం చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమీక్షలపై వైకాపా నుంచి ఫిర్యాదు వచ్చిందన్నారు. ప్రజావేదిక వద్ద సమావేశాల నిర్వహణపై వైకాపా అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు. దీనిపై సీఎస్ నుంచి నివేదిక కోరనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా అధికారులు కష్టపడి పని చేశారని, కానీ కొన్ని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు కోరామన్నారు. ఎన్నికల విధుల్లో తప్పు చేసిన వారిపైనే చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు 600 కోట్ల రూపాయలు వ్యయం అయిందని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు భరిస్తుందని వివరించారు. ఇందులో పోలీస్ సిబ్బంది కోసం 180 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. ఎన్నికల సిబ్బంది పారితోషకాల చెల్లింపు వివాదాలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు సూచించామన్నారు. సిబ్బందికి ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జరగాలని స్పష్టం చేశారు.