ఆంధ్రప్రదేశ్‌

యర్రగొండపాలెంలో వడగండ్ల వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యర్రగొండపాలెం, ఏప్రిల్ 18 : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో ఒక్కసారిగా వడగండ్ల వాన కురిసింది. దీనిని తిలకించిన స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వాన చినుకు కరవై ఆకాశం వైపు చూపు సారించిన రైతులకు గురువారం కురిసిన వాన ఊరట కలిగించింది. సుమారు గంటపాటు భారీగా వడగండ్ల వాన కురవడంతో పట్టణ ప్రజలు వడగండ్లను ఏరుకుంటూ ఇంతటి వానను ఎప్పుడూ చూడలేదని ఆనందం వ్యక్తం చేశారు. కురిసిన వానకు భూగర్భజలాలు పెరుగుతాయని, ఈ వేసవికాలంలో దాహార్తి తీరినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వాన చినుకులతోపాటు సుమారు 150 గ్రాముల సైజులో వడగండ్లు పడటంతో వీధులు వడగండ్లతో నిండిపోయాయి.