ఆంధ్రప్రదేశ్‌

రేపటి నుంచి ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 18: ఏపీ ఎంసెట్-2019 శనివారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ నెల 24వ తేదీ వరకు జరిగే ఎంసెట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఏపీ ఎంసెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూకే వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ ఎం రామలింగరాజు తెలిపారు. ఇంజినీరింగ్ పరీక్షను ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. 23వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామన్నారు. అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షను 23వ తేదీ మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు, 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఎంసెట్ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత (ఆన్‌లైన్) పద్ధతిలో నిర్వహిస్తారని కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు వివరించారు. ఈ నెల 16వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు జారీఅవుతున్నాయని, హాల్ టిక్కెట్ వెనుక విద్యార్థి హాజరవ్వాల్సిన పరీక్షా కేంద్రాన్ని రూట్ మ్యాప్ ద్వారా తెలియపరిచామన్నారు. హాల్ టిక్కెట్లలో కేటాయించిన తేదీ, సమయం ఇచ్చామని, కేటాయించిన సమయానికి ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి హాజరుకావాలన్నారు.
గోరింటాకు, మెహందీ పెట్టుకోవద్దు: కన్వీనర్ సాయిబాబు
పరీక్షకు ముందు బయోమెట్రిక్ విధానంలో ఆయా విద్యార్థుల వేలిముద్ర, ఫొటోను తీసుకుంటామని కన్వీనర్ సాయిబాబు తెలిపారు. అందువల్ల పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గోరింటాకు కానీ, మెహందీ కానీ, మరే ఇతర రంగులను చేతి వేళ్ళకు లేకుండా చూసుకోవాలని స్పష్టంచేశారు. గతంలో మాదిరిగానే పరీక్షకు ఒక నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరన్నారు. పరీక్షా కేంద్రంలోకి కేవలం ఎంసెట్ హాల్ టిక్కెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్, పాస్‌పోర్టు, ఇంటర్ మీడియట్ హాల్ టిక్కెట్ తదితర ప్రభుత్వ గుర్తింపు కార్డులు, పెన్‌లు అనుమతిస్తామన్నారు. ప్రిన్సిపాల్ లేదా గెజిటెడ్ అధికారి అటెస్టేషన్‌తో కూడిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంను, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రం మాత్రమే అనుమతిస్తారన్నారు. హాల్ టిక్కెట్లలో ఏ తేదీన ఏ స్లాట్ కేటాయించారో ఆ రోజునే పరీక్షకు హాజరుకావాలని కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు స్పష్టం చేశారు. ఆ రోజన కేటాయించిన సమయంలో పరీక్షకు హాజరుకాకుంటే ఆ విద్యార్థి పరీక్షకు గైర్హాజరైనట్టు పరిగణిస్తామన్నారు. స్మార్ట్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు, వాచీలు, చిప్‌తో కూడిన పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించమన్నారు. పరీక్ష హాలులో విద్యార్థి రఫ్ వర్క్ చేసుకునేందుకు తెల్ల కాగితాలు అందిస్తారన్నారు. పరీక్ష అనంతరం వాటిని పరీక్షా కేంద్రంలోనే తిరిగి ఇచ్చివేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 42 రీజినల్ సెంటర్లు, హైదరాబాద్‌లో 3 రీజినల్ సెంటర్లకు ఇంజినీరింగ్ విభాగంలో లక్షా 95 వేల 723 మంది, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 86 వేల 910 మంది మొత్తం 2 లక్షల 82 వేల 633 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ విభాగానికి 109 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు విభాగాలకు 6 పరీక్షా కేంద్రాలు వెరశి 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. ఉర్దూ అనువాదం కోసం సుమారు 64 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా వారికి కర్నూలు జిల్లా కేంద్రంగా అనువాదకులను కేటాయించామన్నారు. సహాయకుని కొరకు దరఖాస్తు చేసుకున్న ముగ్గురికి సహాయకులను కేటాయిస్తూ అనుమతినిచ్చామన్నారు. పరీక్షల అంశంపై ఎవరికైనా సందేహాలుంటే వారు 0884-2340535, 2356255 ద్వారా గానీ 2కె 19ఎపి ఎంసెట్ ఎట్‌ది రేట్ ఆఫ్ జి మెయిల్ డాట్‌కామ్‌ను సంప్రదించాలని పరీక్షల కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబు తెలిపారు.