ఆంధ్రప్రదేశ్‌

మార్చిలో విడుదలైన ఉత్తర్వులనే అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: చౌకడిపో డీలర్ల సంక్షేమం పేరిట రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి మాసంలో జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని కోరుతూ చౌకడిపో డీలర్ల సంఘం రాష్ట్ర ప్రతినిధులు గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ వరప్రసాద్‌ను కోరారు. ఈ సందర్భంగా 15 డిమాండ్లతో వినతిపత్రం సమర్పించారు. అనంతరం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు మీడియాతో మాట్లాడారు. దిగుమతి కూలిపై ఇచ్చిన ఉత్తర్వులు ఏప్రిల్ ఓకటో తేదీ నుంచి అమలు కావాల్సి ఉందని, మార్చి 8 తర్వాత మరణించిన డీలర్‌కు మట్టి ఖర్చుల నిమిత్తం రూ. 15వేలు చెల్లించాల్సి ఉందన్నారు. చంద్రన్న బీమా పరిధిలోకి డీలర్లను తీసుకు రావాల్సి ఉందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని, అంగన్‌వాడీ మిడ్‌డే మీల్స్ బకాయిలను డీలర్ల ఖాతాలో జమ చేయాలని, మార్చి నెలకు ముందు డీలర్లకు ఉన్న కంది పప్పు అరువు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని, డీలర్లను కార్మిక శాఖ పరిధిలోకి తెచ్చి గుర్తించాలని కోరారు.
ఈ - పోస్ మిషన్ ప్రతి 20 నిమిషాలకోసారి లాగ్ అవుట్ అవటాన్ని నిరోధించి ఉదయం ఏడు గంటలకు అథంటికేషన్ వేస్తే 11 వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు లాగ్ అవుట్ కాకుండా చూడాలన్నారు. గత 20 ఏళ్లుగా సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన బకాయిలు లెక్కగట్టి వాటిని సంక్షేమ నిధికి జమ చేయాలన్నారు.
గత ఫిబ్రవరి 28న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న రేషన్‌డీలర్‌ల అవగాహన సదస్సుకు హాజరైన డీలర్లందరికీ తక్షణం రవాణా చార్జీలు చెల్లించాలని కోరారు. ఎన్నికల్లో ప్రచారం చేస్తే డీలర్‌షిప్‌ను తొలగించే నిబంధనను తొలగించాలని కోరారు.