ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణలో అంబేద్కర్‌కు అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి తీరని అవమానం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) ఆందోళన వ్యక్తంచేశారు. ఉభయ రాష్ట్రాల్లో శుక్రవారం అంబేద్కర్ విగ్రహాల వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు ఆందోళన నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం వీహెచ్ విలేఖర్లతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లపై ధ్వజమెత్తారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేని, చూడరాని పరిస్థితులను వారిరువురు కల్పిస్తూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. పంజాగుట్ట వద్ద వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి సమీపంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారని, ఎన్నికలు అయిన తర్వాత విగ్రహ స్థాపనకు ప్రయత్నాలు జరిగాయని, అయితే విగ్రహాన్ని నగరపాలక సంస్థ అధికారులు ముక్కలు చేసి డంపింగ్ యార్డులో పడవేయడం పట్ల వీహెచ్ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్లే నేడు దేశంలో ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పరిపాలన చేస్తున్నారన్న విషయాన్ని మరవడం బాధాకరమన్నారు. ఈ సంఘటనపై ఉభయ రాష్ట్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరైనా కేసీఆర్, మోదీలను వ్యతిరేకిస్తే వారిపై ఆర్థికపరమైన దాడులు నిర్వహించేందుకు ఐటీ శాఖ, సీబీఐలు సిద్ధంగా ఉన్నాయన్న విషయం సామాన్యులకు కూడా అర్ధమవుతోందన్నారు. విలేఖర్ల సమావేశంలో కాంగ్రెస్ నేతలు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, కోలా ప్రసాదవర్మ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పి విలియం హ్యేరీ, ఆకుల వెంకటరమణ, అయితాబత్తుల సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... విలేఖర్లతో మాట్లాడుతున్న వీహెచ్