ఆంధ్రప్రదేశ్‌

మోదీకి వ్యతిరేక పవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 19: దేశవ్యాప్తంగా ప్రధానమంత్రికి వ్యతిరేకపవనాలు వీస్తున్నాయని, జాతీయస్థాయి పత్రికలతో పాటు అంతర్జాతీయస్థాయిలో కూడా సర్వే నివేదికలు ఇదే స్పష్టం చేస్తుండటంతో నరేంద్ర మోదీ కులం కార్డు వాడుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు ఎన్నికల ప్రచార నిమిత్తం వెళ్తూ మార్గమధ్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి సీఎం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక హరిత హోటల్‌లో జిల్లా టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ నేతలతో కొద్ది సేపు ముచ్చటించారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల తీరును అడిగి తెలుసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి వ్యవహరించిన తీరువల్ల ఆయనపై నమ్మకం కోల్పోయేలా చేసిందని పేర్కొన్నట్లు సమాచారం. అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేయడం, కొంతమంది బడా వ్యాపారులకు మేలు చేయడం, బ్యాంకు రుణాలు చెల్లించకుండా ఇతర దేశాలకు పారిపోయిన వారిని తిరిగి తీసుకురావడంలో వైఫల్యం, రాఫెల్ కుంభకోణం వంటి ఆరోపణలు మోదీ పనితీరుకు నిదర్శనంగా నిలిచాయని వెల్లడించినట్లు తెలిసింది. 2014లో మోదీపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమయ్యారని
చంద్రబాబు పేర్కొన్నట్లు తెలిసింది. మోదీ వైఫల్యాలను ఎండగట్టి, ఆయనపై వ్యతిరేకత రావడానికి తాను ప్రధాన పాత్ర పోషించడంతో అత్యధిక ప్రతిపక్ష పార్టీలు తనకు మద్దతుగా నిలిచారని స్పష్టం చేసినట్లు తెలిసింది. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తాను బీసీనంటూ ఎన్నికల సభల్లో మోదీ చెప్పడం ద్వారా ఆయన భయపడుతున్నారని స్పష్టమవుతోందని అన్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం ఫలితాలపై వైసీపీ ప్రవర్తన సాధారణమేనని, అవన్నీ జగన్నాటకంలో భాగమేనని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. ఎన్నికల్లో విజయం ఖాయమని ముఖ్యమంత్రి నామఫలకం, మంత్రులెవరు అంటూ రోజూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న తీరును నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకురాగా 2014 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే వ్యవహరించారని సమాధానమిస్తూ జగన్ ముఖ్యమంత్రి కావాలన్న తపన తప్ప వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయరని ఎద్దేవా చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని పట్టించుకోనవసరం లేదని, రాష్ట్రంలో భారీ సంఖ్యలో మహిళలు టీడీపీ అభ్యర్థులకు మూకుమ్మడిగా ఓట్లు వేశారని వెల్లడించినట్లు పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. తన అంచనా ప్రకారం 120 అసెంబ్లీ స్థానాలకు తగ్గవని, సుమారు 135 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని స్పష్టం చేసినట్లు వెల్లడవుతోంది. ఇక లోక్‌సభ స్థానాల్లో 20, 21 స్థానాలు ఖచ్చితంగా వస్తాయని పేర్కొన్నట్లు తెలిసింది. మే 23వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు జగన్ మైండ్ గేమ్ ఆడుతూనే ఉంటారని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేతలకు సూచించినట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతో పాటు ఓడిన అభ్యర్థులు కూడా ప్రభుత్వం ఏర్పాటయ్యాక మరోమారు అన్ని గ్రామాలూ తిరిగి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం రూపొందించాలని సూచించినట్లు తెలిసింది. గతంలో కన్నా రానున్న అయిదేళ్లు మరింత బాగా పనిచేసి భవిష్యత్తులో టీడీపీ విజయం శాశ్వతం చేసుకోవడానికి నాయకులు కృషి చేయాలని చంద్రబాబు అన్నట్లు నేతలు పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు హెలికాప్టర్‌లో రాయచూర్ ఎన్నికల సభకు బయలుదేరి వెళ్లారు.