ఆంధ్రప్రదేశ్‌

అడుగంటుతున్న భూగర్భ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: నైరుతి, ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేడయంతో, దాని ప్రతికూల ప్రభావం వేసవిలో స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాభావంతో రాష్ట్రంలో చాలాచోట్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సాగు, తాగునీటి అవసరాల కోసం 50శాతం మేర భూగర్భ జలాలపై రాష్ట్ర ప్రజలు ఆధారపడుతుంటారు. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగండటంతో నీటి కోసం ప్రజల ఇక్కట్లు పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నాటితో పోల్చుకుంటే రాష్ట్రంలో సగటున 2.88 మీటర్ల మేర భూగర్భ జలాలు అడుగంటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 32.4 శాతం మేర తక్కువ వర్షపాతం రాష్ట్రంలో నమోదైంది. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. 8 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలున్న 964 గ్రామాల్లో వాటిని వెలికితీయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. గత ఏడాది ఇదే కాలంలో శ్రీకాకుళంలో 8.41 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 6.84 మీటర్ల లోతుకు చేరాయి. విజయనగరంలో 8.39 మీటర్లు, విశాఖలో 10.05, తూర్పు గోదావరి జిల్లాలో 10.4, పశ్చిమ గోదావరి జిల్లాలో 20.37, కృష్ణా జిల్లాలో 10.96, గుంటూరు జిల్లాలో 11.28, ప్రకాశం జిల్లాలో 23.81, నెల్లూరు జిల్లాలో 11.58 మీటర్ల లోతుకు చేరాయి. చిత్తూరు జిల్లాలో 27.55 మీటర్లు, కడప జిల్లాలో 26.9, అనంతపురం జిల్లాలో 25.4, కర్నూలు జిల్లాలో 11.91 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు చేరాయి. రాయలసీమలో గత సంవత్సర కాలంలో 7.53 మీటర్ల మేర లోతుకు చేరుకున్నాయి. శ్రీశైలం రిజర్వాయరులో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 808.8 అడుగులకు చేరింది. 33.62 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ప్రధాన మంచినీటి వనరు నాగార్జునసాగర్ కుడి కాలువలో 137.86 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.