ఆంధ్రప్రదేశ్‌

ఊహల్లో విహరిస్తున్న వైసీపీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 20: ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగకుండానే వైసీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చేసినట్లు ఊహల్లో విహరిస్తూ మంత్రి పదవులు సైతం పంచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ ఎద్దేవా చేశారు. శనివారం ప్రజావేదిక మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు అన్ని వర్గాలపై దాడులు చేశారని ఆరోపించారు. అధికారులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు సహా ఎవరినీ వారు వదల్లేదన్నారు. పట్టిసీమ నిర్మాణంలో వందల కోట్ల అవినీతి జరిగిందని పార్టీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అంటున్నారని, పట్టిసీమ ద్వారా ప్రజలకు కలిగిన మేలు ఏమిటో కృష్ణాడెల్టా రైతులను అడిగితే తెలుస్తుందని సూచించారు. బొత్స సత్యనారాయణకు విజయనగరం జిల్లాలో సారా సత్తిబాబు అనే ముద్దుపేరు ఉందని, ఆ పార్టీ నేతలు విమర్శలు చేసేముందు తమ స్థితిగతులేమిటో తెలుసుకోవాలని హితవు పలికారు. ఎవరి దుకాణం బంద్ అవుతుందో ప్రజలకు తెలుసన్నారు. ఎన్నికలు పూర్తవగానే పార్టీ ఐటీ విభాగం ఉద్యోగులను తొలగించి జగన్ లోటస్ పాండ్‌కు చేరుకున్నారని ఎద్దేవా చేశారు. పరిపాలనలో సమర్థత చూపని మోదీ తన అసత్య ప్రచారానే్న నమ్ముకుని ఒక్కో విడత ఎన్నికల్లో ఒక్కో విధానాన్ని అవలంభిస్తున్నారని ఆమె విమర్శించారు. పుట్టినరోజు నాడు ప్రజల కోసం బ్లడ్‌బ్యాంక్‌ను చంద్రబాబు ప్రారంభిస్తున్నారని, ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్, మోదీలకు వారే తగిన బుద్ధి చెప్పనున్నారని యామినీ శర్మ స్పష్టం చేశారు.