ఆంధ్రప్రదేశ్‌

నరేంద్ర మోదీ జేబు సంస్థగా ఈసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 20: తన రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ అధికారంలోకి రాకూడదనే దురుద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని సైతం తన జేబు సంస్థగా మార్చుకుని మోదీ నిరంకుశ పాలనకు తెరలేపారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రంలో ఐటీ దాడులకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. చరిత్రలో ఇప్పటి వరకు 13 మంది ప్రధానులు ఏలారని అయితే మోదీ లాంటి వాళ్లను ఎన్నడూ చూడలేదన్నారు. దేశంలో మోదీ పాలన ఎమర్జెన్సీ చీకటి రోజులను తలపిస్తోందని మండిపడ్డారు. అవినీతి అంతు చూస్తామని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన మోదీ ఎన్నికల్లో పంచిన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చాలని డిమాండ్ చేశారు. మోదీ అండతో వైఎస్సార్ కాంగ్రెస్ 150 నియోజకవర్గాల్లో డబ్బును గుమ్మరించిందని ఆరోపించారు. కేసీఆర్ అండతో జగన్ వేల కోట్లు ఎన్నికల్లో ఎరవేశారన్నారు. వైసీపీ నేతలు తమది ఆపద్ధర్మ ప్రభుత్వంగా ప్రచారం చేయటం దౌర్భాగ్యమన్నారు. ముఖ్యమంత్రి గవర్నర్ వద్దకు వెళ్లి శాసనసభను రద్దుచేసినట్లు ప్రకటించిన అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఆపద్ధర్మంగా కొనసాగుతారని వైసీపీ నేతలకు ఇది కూడా తెలీక పోవటం దురదృష్టకరమన్నారు. ఆపద్ధర్మం అనే పదానికి అర్థం తెలీని వాళ్లు అధికారం కోసం అర్రులు చాస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది జూన్ 8వ తేదీ వరకు తమ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల తక్షణావసరాలైన తాగునీరు, ప్రాజెక్ట్‌ల సమస్యలపై సమీక్షించే బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉంటుందన్నారు. రాజధాని పనులు ఆగితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు ఆగిపోవాలా అని ప్రశ్నించారు. కొత్త జీవోలు ఇవ్వరాదనే విషయం అందరికీ తెలుసన్నారు. మంచినీరు, సాగునీటి సమస్యలపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ఎన్నికల నిబంధనలలో కూడా ఉందనే విషయం గుర్తుచేశారు. తమది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని ఆర్థిక నేరాల కేసులలో నిందితులుగా ఉన్న ఏ 1, ఏ 2 ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి లేదని చెప్తూ వైకాపా నేత విజయసాయిరెడ్డి ఏది చెబితే అది అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగినట్లు దేశంలో ఎక్కడైనా ఎన్నికల వేళ అధికారులను బదిలీ చేశారా అని నిలదీశారు. ఈవీఎంల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయని బ్యాలెట్ పద్ధతే మేలనే నిర్ణయానికి వచ్చారన్నారు. ఎన్నికల రోజున మహిళలు సైతం గంటల కొద్దీ క్యూలైన్లలో ఉన్నారని, ఎన్నికల కమిషన్ కనీస ముందు జాగ్రత్తలు తీసుకోక పోవటం సిగ్గుచేటని విమర్శించారు. భవిష్యత్ తరాలతో పాటు జాతికి రానున్న కాలంలో ఈసీ క్షమాపణ చెప్పుకునే పరిస్థితి రాక తప్పదని హెచ్చరించారు.