ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 69వ జన్మ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉండవల్లిలోని ఆయన నివాసంలో వేదపండితులు ముందుగా ఆశీర్వచనాలు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్సీలు టీడీ జనార్దన్, ఏవీ రమణ తదితరులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలు, పట్టణాల్లో చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును టీటీడీ పండితులు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ఆశీర్వదించారు. ఉండవల్లి ప్రజావేదిక ప్రాంగణానికి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా చంద్రబాబు పలుకరించారు. శాప్ చైర్మన్ పీఆర్ మోహన్, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పార్టీ కార్యదర్శి రమణ, పోతుల సునీత, యామినీ శర్మ, దివ్యవాణి తదితరుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన భారీ కేక్‌ను చంద్రబాబు కట్‌చేశారు. విజయవాడ లయోలా వాకర్స్ అసోసియేషన్, మానసిక వికాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వికలాంగులు సీఎంకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి విరాళంగా లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. బుద్దా వెంకన్న, లంకా దినకర్, వర్ల రామయ్య, రామాంజనేయులు, గురజాల మాల్యాద్రి తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివచ్చి మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని ఆకాంక్షిస్తూ నినాదాలు చేశారు.
చిత్రం... ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా మంత్రులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్