తెలంగాణ

ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలం : బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, దీంతో దాదాపు 21వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందని బీజేపీ ధ్వజమెత్తింది. బోర్డు తన తప్పిదాలను వెంటనే సరిదిద్దుకుని విద్యార్థులకు న్యాయం చేయకుంటే సోమవారం ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేపడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హెచ్చరించారు. బోర్డు వైఫల్యాలపై న్యాయ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలపై బోర్డు కార్యదర్శి అశోక్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కోరుకున్న విద్యార్థులకు ఉచితంగా జవాబు పత్రాలను ఇవ్వాలని, రూ.600 ఫీజు వసూలు చేయడం సరికాదన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీ్ధర్ రెడ్డి మాట్లాడుతూ పరీక్ష నిర్వహణకు సంబంధించి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను తప్పించి ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పజెప్పడంతో సమస్యలు వచ్చాయన్నారు. అర్హతలేని సంస్థకు విధులు అప్పగించడంతో ఆంతర్యమేమిటోనని, బోర్డు విద్యార్థుల తల్లితండ్రుల విశ్వసనీయత కోల్పోయిందన్నారు.