ఆంధ్రప్రదేశ్‌

వైద్యం కోసం వెళ్తే అవయవాలు కొట్టేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లూరు, ఏప్రిల్ 21 : ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలైన గిరిజనుడిని నెల్లూరులోని ఒక కార్పొరేట్ వైద్యశాలకు తీసుకుని వెళ్తే శరీరంలోని ఆవయువాలను తీసుకుని దేహాన్ని బంధువులకు అప్పగించారు. వివరాలలోకి వెళితే నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఉద్దేపుగుంటకు చెందిన గిరిజన యువకుడు అదే మండలంలోని బీరంగుంట వద్ద ఇటుక బట్టీలలో పనిచేస్తున్నాడు. ఈ నెల 17న పనుల అనంతరం సరకుల కొరకు వెళ్లి వస్తుండగా మోటారు సైకిల్ ఢీకొట్టింది. దీంతో గాయపడిన శ్రీనివాసులును నెల్లూరులోని సింహపురి వైద్యశాలకు తరలించారు. రెండు రోజులుగా శ్రీనివాసులు వైద్యచికిత్సల నిమిత్తం నగదును చెల్లించాలని వైద్యశాల వైద్యులు ఒత్తిడి చేశారు. దీంతో తమ వద్ద నగదు లేదని, తాము కూలీనాలి చేసుకుని జీవనం సాగిస్తున్నామని ప్రాధేయపడ్డారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యసేవలు అందించాలని కోరారు. దీంతో వైద్యశాల సిబ్బంది కొన్ని పత్రాలను అందజేసి సంతకాలు చేయాలని శ్రీనివాసుల భార్య ఆరుణకు చెప్పారు. నిరక్ష్యరాసులైన ఆరుణ వైద్యశాల సిబ్బంది ఇచ్చిన పత్రాలపై వేలిముద్రలు చేసింది. కొంత సమయం అనంతరం వైద్యులు శ్రీనివాసుల ఆరోగ్యం క్షీణించిందని చెప్పి కొన్ని గంటల అనంతరం మృతి చెందాడని తెలిపారు. దీంతో శ్రీనివాసుల భార్య ఆరుణ, పిల్లలు బోరున విలపించారు. అనంతరం వైద్యశాల సిబ్బంది శ్రీనివాసుల మృతదేహాన్ని బంధువులకు అప్పగించారని శ్రీనివాసుల భార్య ఆరుణ తెలిపారు. అయితే తన భర్త శరీరంలోని అవయువాలను తీసుకున్న విషయం తమకు చెప్పలేదని, మరుసటి రోజు వివిధ పత్రికలలో చూసిన తర్వాతే తమకు అవయువదానం విషయం తెలిసిందని ఆమె తెలిపారు. తమకు తెలియకుండా తన భర్త శరీరం నుంచి అవయువాలను సేకరించిన సింహపురి వైద్యశాల పై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య ఆరుణ, బంధువులు ప్రభుత్వంను కోరుతున్నారు.