ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల నియమావళి ఎవరికైనా ఒకటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 21: రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి కల్పించిందని, అయితే రాజ్యాంగ పరమైన విధుల నిర్వహణలో ఈసీ విఫలమవుతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రధాని అయినా, సామాన్యుడైనా ఈసీకి ఒకటేనని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఒక్కొక్కరికీ ఒక్కో నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సంఘం అమలు చేస్తున్నది మోడ్ ఆఫ్ కండక్ట్ కాదని, అది మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్‌గా మారిందని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఆక్షేపించారు. ప్రధాని హెలికాప్టర్‌ను సోదా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇందుకు బాధ్యుడైన ఓ అధికారిని సస్పెండ్ చేయటం ఎంతవరకు సమంజసమన్నారు. అదే ముఖ్యమంత్రుల హెలికాప్టర్లు సోదా చేసేవారిపై ఎందుకు చర్యలు తీసుకోరని నిలదీశారు. ప్రధానికి ఒక రకంగా, ముఖ్యమంత్రులకు మరో రకంగా రాజ్యాంగాన్ని రచించారా అని మండిపడ్డారు. ఎన్నికల సంఘం నిబంధనలు హోదాకోరకంగా ఉన్నాయని విమర్శించారు. ప్రధాని హెలికాప్టర్ సోదాల్లో ఏం దొరికాయి? వాటిని ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. ప్రధాని హెలికాప్టర్ నుంచి దించిన నల్ల ట్రంక్ పెట్టెతో పరారైన వాళ్లెవరో తేల్చాలన్నారు. ఆ ట్రంక్ పెట్టెలో ఏమున్నదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. వీడియో క్లిప్పింగ్‌లు సాక్ష్యాలుగా ఉన్నప్పటికీ ఈసీ ఎందుకు చర్యలు చేపట్టలేదో తేల్చాలన్నారు. ఎవరు చెబితే ఎన్నికల సంఘం ముస్లిం మైనారిటీ అధికారిని సస్పెండ్ చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సస్పెన్షన్ వరకు వచ్చిన ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేలాల్సి ఉందన్నారు. పీఎం హెలీకాప్టర్‌లో ఏదో ఉందని, అక్రమాల చిట్టాపై విచారణ జరిపి బహిర్గతం చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలపై కూడా ప్రధాని ప్రభావితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి రూ. 211 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయని నిలదీశారు. మిగిలిన అన్ని పార్టీలకు రూ. 11 కోట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. బీజేపీకే విరాళాలు అందేలా మోదీ ప్రభావితం చేస్తున్నారనేది దీన్నిబట్టి తేలిందన్నారు. ఇతర పార్టీలకు విరాళాలివ్వద్దని మోదీ ఒత్తిడి తెచ్చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది మోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికార పార్టీ కనుసన్నల్లో సీఈసీ పనిచేస్తోందని, అధికార పార్టీ చానల్ నమో టీవీపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. సైలెన్స్ పీరియడ్ అనే పదం ఎన్నికల నిబంధనల్లో లేదని, సరికొత్తగా దీన్ని ప్రధాని కోసం ఈసీ తెరపైకి తెచ్చిందని ఆయన విమర్శించారు. నమో చానల్‌ను ప్రధాని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఆ చానల్‌లో మోదీ భజన తప్ప మరొకటి లేదని, దీన్ని ఎన్నికల ఖర్చులో ఎందుకు కలపరని నిలదీశారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని నియమావళికి అతీతులుగా ఈసీ పరిగణించడం దౌర్భాగ్యమన్నారు. వ్యాపారులంతా వివిధ రాష్ట్రాల్లో ఓటర్లుగా ఉంటే వారికి లబ్ధి చేకూరేలా మోదీ మాట్లాడటం నిబంధనల ఉల్లంఘన కిందికి రాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికైంది ప్రజా ప్రభుత్వమని, అది ఇంటెరిమ్ గవర్నమెంట్ కాదని గ్రహించాలన్నారు. ఆర్థిక నేరగాళ్లు ఈసీ తరపున చర్యలకు సిఫార్సు చేసే దుస్థితి దేశంలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలకు నిధుల కేటాయింపును నిలపకుండా రాష్ట్రంలో రైతులకిచ్చే పెట్టుబడి సాయాన్ని, పసుపు-కుంకుమ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేశారన్నారు. ఇది చాలక ఢిల్లీ హైకోర్టుకు కూడా వెళ్లారని, అక్కడ వైసీపీ నేతలకు గుణపాఠం తప్పలేదన్నారు. కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేదన్నారు. అప్పులు, వడ్డీరేట్లపై ప్రధాన కార్యదర్శి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మంత్రి మండలికి సీఎస్ సబార్డినేట్ మాత్రమే అని గుర్తుంచుకోవాలన్నారు. సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా ఏపీ సీఎస్ వ్యవహరిస్తున్నారని ఖండించారు.
చివరకు న్యాయ వ్యవస్థను కూడా వేధింపులకు గురిచేస్తున్నారని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవేదనే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి అధికారాన్ని కట్టబెట్టేందుకు దేశ ప్రజలు సిద్ధంగా లేరని యనమల పేర్కొన్నారు.