ఆంధ్రప్రదేశ్‌

వర్షంతో ఊరట.. వాగువంకల్లోకి నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు/తిరుపతి/నెల్లూరు,ఏప్రిల్ 22: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో గత మూడురోజుల నుండి ఒకమోస్తరునుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అన్నివర్గాల ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. గత కొన్నిరోజులనుండి ప్రచంఢభానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం తొమ్మిదిగంటలనుండే ప్రజలు బయటకు రావాలంటే భయపడే పరిస్ధితి నెలకొంది. కాని ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రజలతో సేదతీరుతున్నారనే చెప్పవచ్చు. ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఏప్రిల్ నెలలో సరాసరిన 11.8సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సిఉండగా ఈనెల 21తోనే 12.4సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇదిలావుండగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిశాయి. అయితే కొన్ని మండలాల్లో గాలివాన బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని మండలాల్లో చినుకు జాడ కూడా లేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. సురుటుపల్లిలో గాలివానకు భారీ చెట్టు కారుపై విరిగిపడింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ఆసమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సురుటుపల్లిలో సోమవారం మధ్యాహ్నం భారీవర్షం కురిసింది. పల్లికొండేశ్వర స్వామి ఆలయ దర్శనం కోసం చెన్నై నుంచి రెండు కార్లలో భక్తులు వచ్చి స్వామి వారి దర్శనం అనంతరం ఇందులో టీఎన్ 67 1234 నెంబరుగల కారు బయలుదేరి రోడ్డుపై నిలబెట్టి వెనకాల వస్తున్న తమ బంధువుల కారుకోసం వేచి ఉన్నారు. ఆ సమయంలో గాలి, వాన బీభత్సం సృష్టించింది. దీంతో వేప చెట్టు విరిగి ఆ కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ కారులో ఉన్న ముగ్గురు మహిళలకు ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. దీంతో చెన్నై-పుత్తూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి, విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.కాగా నెల్లూరు జిల్లావ్యాప్తంగా పలు చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని ఆత్మకూరు, గూడూరు, కావలి డివిజన్ల పరిధిలోని మర్రిపాడు, సైదాపురం, ఉదయగిరి మండలాల్లో ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం కురిసింది. వర్షంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లబడ్డాయి. అయితే ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మామిడి, జామ తదితర పండ్లతోటల్లో కాయలు నేలరాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురంలో పిడుగుపాటుకు నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.
చిత్రం...సురుటుపల్లిలో చెట్టు విరిగి పడటంతో నుజ్జునుజ్జయిన కారు