ఆంధ్రప్రదేశ్‌

ఒంటిమిట్ట రామయ్యకు పుష్పయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఏప్రిల్ 22: ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీకోదండరామునికి పుష్పయాగం వేడుకగా నిర్వహించారు. తొలుత ఉత్సవవర్లకు ప్రత్యేక అలంకారం చేసి వేదికపై ఆశీనులను చేయించారు. అనంతరం టీటీడీ ఆధ్వర్యంలో వేదపండితులు తులసీదళాలు, మల్లెలు, మల్లీయలు, రోజా, చామంతి, గనే్నరు, నూరువరహాలు, సంపంగి, మానసంపంగి, మొగళిదళం పుష్పాలు, పత్రాలు స్వామికి సమర్పించారు. ఈ పుష్పాలను బెంగళూరు, తిరుపతి నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. భక్తులు పెద్దసంఖ్యలో పుష్పయాగాన్ని తిలకించారు.