ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ బకాయిలు చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: ఆర్టీసీ కార్మికుల 2013 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఆ సంఘం అధ్యక్షుడు కె.శంకరరావు సోమవారం వినతిపత్రం అందచేశారు. సంస్థ నుంచి రావాల్సిన పాత బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 650 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. ఇందులో 350 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు గత ఏడాది అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ అయితే, ఇప్పటికీ ఆ మొత్తం ఆర్టీసీకి చేరలేదన్నారు.