ఆంధ్రప్రదేశ్‌

తాగునీటి ఎద్దడి, వలసలపై 25న కలెక్టర్లకు వినతిపత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న తాగునీటి ఎద్దడి, వలసల నివారణ కోసం సత్వరమే చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన 13 జిల్లాల్లోని కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ తెలిపారు. అకాల వర్షాలకు కొన్ని చోట్ల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. పార్టీ జిల్లా సమితులు ఈ మేరకు ఆయా జిల్లాల్లో సమస్యలను కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని దాసరి భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను మీడియా వెలుగులోకి తెస్తోందన్నారు. ప్రధానంగా అనేక గ్రామాల్లో తీవ్రంగా ఉన్న తాగునీటి ఎద్దడిపై పత్రికలు, టీవీ ఛానళ్లు దృష్టి సారించాయన్నారు. రాయలసీమలో చాలా చోట్ల అత్యంత గడ్డు పరిస్థితులు నెలకొనడంతో పెద్ద ఎత్తున ప్రజలు వలసలు పోతున్నారని తెలిపారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి వేల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాలు, పట్టణాలు, నగరాలకు వలసలు పోతున్నారన్నారు. అనేకచోట్ల మంచినీరు లేకపోవడం వల్ల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. పశుగ్రాసం కొరత కూడా తీవ్రంగా ఉందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎన్నడూలేని రీతిలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసి డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎన్నికలు జరిపించారని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం అక్రమంగా తరలిస్తున్న రూ. 140 కోట్లను సీజ్ చేసిన ఈసీ ఈ డబ్బులు ఎవరివో, ఏ అభ్యర్థులవో ప్రకటించి వారి ఫలితాలను నిలిపివేయాలన్నారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని రామకృష్ణ వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, రావుల వెంకయ్య పాల్గొన్నారు.