ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల సమయంలో బాబు సమీక్షలు తప్పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 23: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో సమీక్షలు నిర్వహించటం తప్పేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉద్ఘాటించారు. మంగళవారం గుంటూరులోని తన స్వగృహంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న గొడవలు చూస్తుంటే అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు ఆలస్యంగా చేరలేదని, ఆయనే అధికారుల సాయంతో మేనేజ్ చేసి దొంగే దొంగ .. దొంగ అని అరచిన చందంగా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఈవీఎంలను మేనేజ్ చేయడం ఆయనకు అలవాటేనని తెలుస్తోందన్నారు. రాయచూర్ వెళ్లి సోనియాగాంధీ రాష్ట్ర విభజన బాగా చేసిందని చెప్పడం సరికాదని, రాష్ట్ర ప్రజలకు ఈ అంశంపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ జరిగిందని, విచారణ జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరితే స్పందించలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం కళ్లకు గంతలు కట్టుకుని చోద్యం చూస్తోందని ఎద్దేవా చేశారు. రూ.50 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్న జేసీ దివాకరరెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేసి, నిరూపించమంటే ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.

చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ