ఆంధ్రప్రదేశ్‌

విచారణ పూర్తి.. సిద్ధమైన నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 23: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి చెందిన 1381 కేజీల బంగారం చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి టీటీడీ ట్రెజరీకి తరలించే అంశంపై తలెత్తిన వివాదంపై రాష్ట్ర ముఖ్యకార్యదర్శి నియమించిన కమిటీ మంగళవారం విచారణను పూర్తిచేసింది. నివేదికను సిద్ధం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తిరుపతికి తరలిస్తున్న 1381 కేజీల బంగారాన్ని తమిళనాడులో తిరువళ్లూరు చెక్‌పోస్టు వద్ద తనిఖీలలో పట్టుబడిన సంగతి విదితమే. ఈ సంఘటనపై పలు అనుమానాలు, పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ మన్‌మోహన్‌సింగ్‌ను విచారణాధికారిగా నియమించింది. ఈ నేపథ్యంలో సోమవారం తిరుపతికి వచ్చిన ఆయన టీటీడీ ఈవోతోను, ఎఫ్‌ఎ అండ్ సీఎవో విజిలెన్స్ అధికారులతోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులతో సమావేశం అయ్యారు. వచ్చిన విమర్శలపై ఆరా తీశారు. టీటీడీ అధికారులనుంచి వివరాలు సేకరించారు. మంగళవారం ఉదయం బయలుదేరి అమరావతికి వెళ్లారు. బుధవారం మన్‌మోహన్‌సింగ్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరి ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు నివేదికను అందజేయనున్నారు.