ఆంధ్రప్రదేశ్‌

69.4 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 24: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు ఇప్పటికి 69.4 శాతం పూర్తయింది. వారాల వారీగా నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమిస్తూ పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యే విధంగా లక్ష్యాన్ని సవరణచేశారు. అయితే కనెక్టవిటీ ప్యాకేజీల్లో జఢత్వం కన్పిస్తోంది. ఎడమ ప్రధాన కాల్వ పనులు కూడా మందగమనంలో సాగుతున్నట్టుగా కన్పిస్తోంది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్సు గత వారం 60.94 శాతం నుంచి ఈ వారానికి 61.52 శాతానికి చేరుకున్నాయి. వారం రోజుల్లో 0.58 శాతం పనిజరిగింది. ప్రధాన డ్యామ్ ప్యాకేజీల్లో గత వారం 60.89 శాతం నుంచి ఈ వారానికి 61.51 శాతం జరిగింది. ఈ వారం రోజుల్లో 0.62 శాతం పని జరిగింది. స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ఫ్లాంక్ మట్టి పనులకు సంబంధించి గత వారం 84.60 శాతానికి చేరుకుంటే, ఈ వారంలో 0.30 శాతం పని జరిగి 84.90 శాతానికి చేరింది. కాంక్రీటు పనికి సంబంధించి స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ గత వారం 72.40 శాతం నుంచి ఈ వారం రోజుల పాటు 0.90 శాతం పని జరిగి ఈ వారాంతానికి 73.30 శాతానికి చేరుకుంది. రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ చివరి దశకు చేరుకుంది. కనెక్టవిటీ ప్యాకేజీల విషయానికొస్తే గత వారం 61.42 శాతం నుంచి ఈ వారం రోజుల పాటు 0.16 శాతం పని జరగడంతో 61.58 శాతం పని జరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ గట్టు వైపు కనెక్టవిటీలు గత వారం 48.57 శాతం జరిగింది. ఈ వారం రోజుల్లో కనీస స్థాయిలో పని ముందుకు జరగలేదు. కుడి గట్టు వైపు కనెక్టవిటీల్లో గత వారం 74.91 శాతం పని జరగ్గా ఈ వారం రోజుల్లో కేవలం 0.34 శాతం పని జరిగి 75.25 శాతానికి చేరుకుంది. ఇక ఎడమ ప్రధాన కాల్వ పనులు గత వారం 70.38 శాతం జరిగితే ఈ వారంలో 0.21 శాతం పని జరిగింది. దీంతో 70.59 శాతం పని జరిగింది. కుడి ప్రధాన కాల్వ పని గత వారం 90.87 శాతం పని జరిగితే ఈ వారంలో కేవలం 0.12 శాతం మాత్రమే జరిగింది. దీంతో ప్రస్తుతం 90.99 శాతానికి చేరింది.
ప్రధాన డ్యామ్ పరిధిలోని స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌లలో మొత్తం మట్టి పని 1169.56 లక్షల క్యూబిక్ మీటర్లు జరగాల్సివుండగా ఇప్పటికి 992.84 లక్షల క్యూబిక్ మీటర్లు పని జరిగింది. స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్‌కు సంబంధించి కాంక్రీటు పని మొత్తం 38.88 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటికి 28.50 శాతం పూర్తయింది. ఇక కుడి ప్రధాన కాల్వకు సంబంధించి డిజైన్ ప్రకారం 177.9 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది.
176.20 కిలోమీటర్ల లైనింగ్‌కు ఇప్పటి వరకు 157.625 కిలోమీటర్ల మేర లైనింగ్ పూర్తయింది. ఎడమ ప్రధాన కాల్వ మొత్తం పొడవు 210.927 కిలోమీటర్లు కాగా 185.073 కిలోమీటర్లు పూర్తయింది. లైనింగ్ విషయానికొస్తే127.220 కిలోమీటర్ల 60.31 శాతం పూర్తయింది.