బిజినెస్

ఆర్టీసీ చార్జీల పెంపు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: సొంతంగా బస్సులు కొనుగోలు చేసి నడిపితే ఆర్టీసీకి మిగిలేవి నష్టాలేనని, నష్టాలు తగ్గించుకునే చర్యల్లో భాగంగానే ఆర్టీసీ హైర్ బస్సులు నడుపుతోందని ఆర్టీసీ వైస్ చైర్మన్ కం మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర బాబు స్పష్టం చేశారు. విశాఖ రీజియన్ ఆర్టీసీ పనితీరును బుధవారం సమీక్షించిన ఆయన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రస్తుతం సుమారు 12 వేల బస్సులు, 150 కోట్ల కిమీ మేర నడుస్తున్నాయని, ప్రతి కిలోమీటర్‌కు ఆర్టీసీ రూ.6 నష్టం చవి చూస్తోందన్నారు. సొంతంగా వాహనాలు నడపడం ద్వారా ఈ నష్టాల భారం సంస్థపైనే పడుతోందన్నారు. ఆర్టీసీ బోర్డు అనుమతి మేరకు తమకు 35 శాతం వరకూ హైర్ బస్సులు నడిపేందుకు అవకాశం ఉందని, అయితే ప్రస్తుతం కేవలం 22 శాతం మాత్రమే హైర్ బస్సులు నడుస్తున్నాయన్నారు. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 1000 బస్సుల వరకూ అదనంగా నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులకు అమలు చేసిన పీఆర్‌సీ కారణంగా ఆర్టీసీపై రూ.750 కోట్ల మేర అదనపు భారం పడిందని, దీనికి తోడు పెరిగిన ఇంధన ఛార్జీలతో కలిపి నష్టాలు రూ.1250 కోట్లకు చేరుకున్నాయన్నారు. అయితే ఆర్టీసీ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటూ, అనవసర ఖర్చులు నియంత్రించుకోవడం ద్వారా రూ.500 కోట్ల మేర లాభపడిందన్నారు. దీని దృష్ట్యా నష్టాలు రూ.1000 కోట్లకు పరిమితం చేసుకోగలిగామన్నారు. గత నాలుగేళ్లుగా ఇంథన ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆర్టీసీ ఛార్జీలు మాత్రం పెంచలేదని గుర్తు చేశారు. అయితే పెరుగుతున్న నష్టాలను అధిగమించేందుకు ఛార్జీల పెంపు అనివార్యమని, అందుకే దీని ప్రతిపాదన ప్రభుత్వానికి పంపామన్నారు. ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోలుండగా కేవలం 12 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయని, మిగిలిన డిపోలన్నీ నష్టాల్లోనే ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఆర్టీసీ స్థలాలను లీజుకివ్వడం, నిర్మించు, నిర్వహించు, బదలాయించు (బీఓటీ) ప్రాతిపదికన రాష్టవ్య్రాప్తంగా 31 స్థలాను గుర్తించి టెండర్లు పిలిచామన్నారు. అయితే కేవలం 16 ప్రాజెక్టులు మాత్రమే అనుకున్న మేర పూర్తయ్యాయని, మిగిలిన 15 చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నయన్నారు. వీటికి త్వరలోనే మరోసారి టెండర్లు పిలుస్తామని చెప్పారు.
మూడేళ్ల కిందట ఆర్టీసీ అనుబంధంగా నిర్వహించిన ఏఎన్‌ఎల్ పార్శిల్ సర్వీసును ఇప్పుడు ఆర్టీసీ సొంతంగా నిర్వహిస్తోందన్నారు. గతంలో ఏడాదికి రూ.9 కోట్లు మాత్రమే పార్శిల్ సర్వీసు ద్వారా ఆదాయం వచ్చేదని, సొంతంగా నిర్వహించిన తొలి సంవత్సరంలోనే రూ.44 కోట్లు, రెండో సంవత్సరం రూ.72 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. ఈ ఏడాది రూ.120 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు సంబంధించి కొన్ని ఇబ్బందుల దృష్ట్యా నియామకాలు నిలిచిపోయాయన్నారు. 1998 నుంచి కారుణ్య నియమకాలు జరగలేదని, 2015-16 నాటికి సుమారు 1000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న ఆర్టీసీ వీసీ కమ్ ఎండీ సురేంద్రబాబు