ఆంధ్రప్రదేశ్‌

మత్స్యకారులకు చిక్కిన భారీ కొండచిలువ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయపురం, మే 25: తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం శివారు పాటిచెరువు సమీపంలోని పంట కాలువలో గురువారం 15 అడుగుల భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. ప్రధాన పంట కాలువ మూసివేయటంతో మత్స్యకారులు కొందరు గురువారం ఉదయం 9 గంటల సమయంలో చేపలు పట్టడానికి వెళ్లారు. చేపల కోసం వేసిన చేతి వలలో సుమారు 15 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ చిక్కింది. ఇది చూసిన మత్స్యకారులు భయకంపితులపై వలను వదిలేసి గట్టుపైకి చేరుకున్నారు. అయితే వలలో చిక్కుకున్న భారీ కొండచిలువ వలతోపాటు గట్టుపైకి రావటంతో భయంతో మత్స్యకారులు వేసిన కేకలకు గ్రామస్థులు, సమీప గ్రామంలోని వారు అక్కడకు చేరుకున్నారు. గట్టుపైకి చేరుకున్న కొండచిలువ శరీరానికి చుట్టుకుని ఉన్న చిన్న వల నుండి బయటపడటానికి విశ్వప్రయత్నం చేసింది. స్థానికులు చాకచక్యంగా కోళ్లను కప్పెట్టడానికి ఉపయోగించే ఇనుప ఊచల గంపను కొండచిలువపై వేసి బంధించారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. రాజమహేంద్రవరం నుంచి అటవీ శాఖ సిబ్బంది కొండచిలువను బంధించి వారి వెంట తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ పై అధికారుల సూచనల మేరకు జంతుసంరక్షణా కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.

చిత్రం...ఇనుప ఊచల గంపలో బందీగా ఉన్న కొండచిలువ