ఆంధ్రప్రదేశ్‌

‘రివర్స్’ పందాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రస్తుత సాధారణ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాకరంగా మారిన నేపథ్యంలో ఒక వైపు ఆయా పార్టీల శ్రేణుల్లో నరాల తెగే ఉత్కంఠ నెలకొంటే బెట్టింగ్ రాయుళ్లకు మాత్రం పండుగలా మారింది. పోలింగ్ ప్రారంభం నుంచే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఫలానా నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తాడనే దానిపై జోరుగా పందాలు మొదలయ్యాయి. పోలింగ్ రోజున హల్‌చల్ చేసిన సోషల్ మీడియా వార్తల ఆధారంగా జూదరులు ముందు వెనుకా ఆలోచించకుండా, అసలు ఆయా నియోజకవర్గాల హద్దులు ఏమిటో కూడా తెలియని వారు సైతం లక్షల్లో పందాలు కాశారు. తాజాగా మండలాలు, డివిజన్‌లు, గ్రామాలు చివరకు పోలింగ్ కేంద్రాల వారీగా అందుతున్న సమాచారం ఆధారంగా అత్యధిక మంది తాము పప్పులో కాలేసామని భావించి, లక్షలు రాకపోగా కనీసం నష్టం లేకుండా బయటపడదామనే ఉద్దేశంతో ముందు తాము ఏ పార్టీ... అలాగే ఏ అభ్యర్థి పేరిట అనుకూలంగా పందాలు కాసారో ప్రస్తుతం దానికి పూర్తి భిన్నంగా ‘రివర్స్’లో పందాలు కాయటం ప్రారంభించారు. దీని వల్ల నయాపైసా నష్టం రాకుండా ఏ పార్టీ... ఏ అభ్యర్థి గెలిచినా లాభనష్టాలు లేకుండా సరిసమానం అవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పందాలు కాయటానికి కొత్తతరం రోడెక్కుతోంది. ఈ కేటగిరీకి చెందిన వారు జాగ్రత్తగా జిల్లాలో పర్యటిస్తూ జిల్లాల వారీగా పలు రంగాలకు చెందిన వారితో సమావేశమై వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థుల జయాపజయాలపై ఆరాలు దీస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు సైతం ఏపీ ఫలితాలపై ఆసక్తి చూపుతుండటంతో అక్కడి వారు కూడా పందాలకు దిగుతున్నారు. ఈ కేటగిరీకి చెందిన వారు ఫోన్ల ద్వారా తమ బంధుమిత్రుల నుంచి నియోజకవర్గాల ద్వారా ఆరా తీస్తున్నారు. 13 జిల్లాల్లో సర్వే పూర్తి తర్వాత పందాలు కాయటానికి లక్షలు, కోట్లాది రూపాయలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మూడో కేటగిరీకి చెందిన వారు తెలివిగా వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర, జిల్లా కార్యాలయాల వద్ద కాపుకాసి లోపల జరుగుతున్న సమీక్షలను అవగతం చేసుకుంటున్నారు. మూ డు, నాలుగో స్థానంలో ఉండే రాజకీయ పక్షాల కార్యాలయాల వద్ద కూడా మాటు వేసి టీడీపీ, వైకాపా భవితవ్యంపై ఆరాదీస్తున్నారు.
ఏదిఏమైనా పందెం రాయుళ్లలో రోజురోజుకి ఉత్కంఠత పెరుగుతోంది.