ఆంధ్రప్రదేశ్‌

ఓట్ల లెక్కింపునకు 21 వేల మంది సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు 21 వేల మంది సిబ్బంది సేవలు ఉపయోగించుకోనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది వెల్లడించారు. ఎవరు ఎక్కడ ఓట్ల లెక్కింపులో పాల్గొంటారో చివరి నిమిషం వరకూ తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది ఎంపిక తరువాత, రెండు సార్లు ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఐదేసి పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామన్నారు. మే 23న ఉదయం ముందుగా పోస్టల్, సర్వీస్ ఓట్లు లెక్కిస్తామన్నారు. లెక్కింపు ప్రారంభమయ్యే ముందు చివరి నిమిషం వరకూ పోస్టల్, సర్వీస్ ఓటర్లు తమ ఓటును ఉపయోగించుకోవచ్చన్నారు. ఓకే పేరుతో రెండు పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చే అవకాశం లేదని, అలా ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. టేబుళ్ల పెంపునకు విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు సహా మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో రీపోలింగ్‌కు సంబంధించి ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను వెంకటగిరి ఎమ్మెల్యే బెదిరించినట్లు ఫిర్యాదు అందిందని, దీనిపై విచారణ జరపాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.