ఆంధ్రప్రదేశ్‌

కబుర్లు మాని హోదాకోసం పోరాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: ఆంధ్రాకు ప్రత్యేక హోదా గురించి అన్ని పక్షాలను కలుపుకుని పోరాడకుండా, అరటాకులా నలిగిపోతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడం అత్యంత విచారకరమని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విభజన సమయంలో రక్తం మరుగుతోందని చెప్పారని, ఇప్పుడు మరిగిన రక్తం ఆవిరైందా అని బాబును నిలదీశారు. బుధవారం లోటస్‌పాండ్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నవారి చేత రాజీనామా చేయించకుండా డ్రామాలు ఆడుతున్నారన్నారు. కబుర్లు మాని హోదా కోసం పోరాడాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫోన్‌లో ఏమి మాట్లాడారు, ఏ హామీ ఇచ్చారో తెలియచేయాలని ఆయన డిమాండ్ చేశారు. హోదా గురించి ప్రస్తావించకుండా, ప్యాకేజీ ఇస్తామనడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా విపక్షాలకు ఎటువంటి ఆగ్రహం ఉండదన్నారు. ప్రజా ప్రయోజనాలకోసం కేంద్రంపై పోరాడి హోదాను తీసుకురానందుకు ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. తిరుపతి, నెల్లూరు సభలో హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న చంద్రబాబు, స్విస్‌చాలెంజ్ ముసుగులో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కేంద్రంపై విమర్శల దాడిని తీవ్రతరం చేస్తే సిబిఐ దర్యాప్తుకు ఎక్కడ ఆదేశిస్తారనే భయం చంద్రబాబుకు ఉందన్నారు. హోదా సాధించేంతవరకు లోక్‌సభలో వైకాపా పోరాడుతుందని, టిడిపి సభ్యులు మాత్రం తమ స్థానాల్లో కూర్చుని ఆందోళనను నిర్వీర్యం చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు.

పుష్కరాలకు ‘ముసురు’!
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఆగస్టు 3: గోదావరి అంత్య పుష్కరాలకు వాన తాకిడి తగిలింది..కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు పడుతూ ముసు రు వాతావరణం నెలకొనడంతో యాత్రికుల రద్దీ అంతగా కనిపించలేదు. బుధవారం నుంచి శ్రావణం మొదలైనప్పటికీ వర్షం కారణంగా ఆ ప్రభావం కనిపించలేదు. రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలోని స్నాన ఘట్టాల్లో ఒక్క పుష్కర ఘాట్ మాత్రమే యాత్రికులతో రద్దీగా కనిపించింది. మిగిలిన ఘాట్‌లలో అంతగా రద్దీ కానరాలేదు. ఇటు కోటిలింగాల ఘాట్‌లోనూ, అటు పుష్కర ఘాట్‌లోనూ పెద్ద ఎత్తున పిండ ప్రదాన క్రతువులు నిర్వహించుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యాత్రికులు అత్యధికంగా వచ్చారు. ప్రతీ అంత్య పుష్కరాలకు ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి అత్యధికంగా రావడం ఆనవాయితీ. బుధవారం నుంచి ఉత్తరాంధ్రా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన యాత్రికుల తాకిడి మొదలైంది.

ఈ జిల్లాల నుంచి యాత్రికుల సంఖ్య ఇకపై పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఒడిశా యాత్రికులు కూడా క్రమేణా రావడం కన్పిస్తోంది. బుధవారం జిల్లా వ్యాప్తంగావున్న వివిధ స్నాన ఘట్టాల్లోనూ సుమారు 67 వేల మంది యాత్రికులే స్నానాలు ఆచరించినట్టు అంచనావేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ 6వ తేదీ, 7వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ అత్యధిక రద్దీ ఉంటుందని అంచనావేసింది. ఈ మేరకు భారీ ఏర్పాట్లుచేశారు.
11వ తేదీ పుష్కరుడుకి గోదావరి నదిలో వీడ్కోలు పలికేందుకు వినూత్నంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి ఆ రోజు రానున్నారు. ఆ రోజు రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పుష్కరుడికి ముఖ్యమంత్రి వీడ్కోలు పలికి, రాత్రి కృష్ణా నదీ సంగమం వద్ద పుష్కరుడికి స్వాగతం పలకనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటినుంచే అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. కాగా గోదావరి నదికి ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు మొదలైన క్రమంలో నీటి మట్టం క్రమేణా పెరుగుతోంది.

ప.గో.లో కొనసాగిన జోరు
కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాదక్షేత్రం, నరసాపురంలోని ఘాట్‌లో అంత్య పుష్కరాల నాలుగో రోజు బుధవారం అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రావణమాసం కావడంతో అధిక సంఖ్యలో మహిళలు స్నానాలు ఆచరించి దైవదర్శనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుండే గోష్పాదక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది.