ఆంధ్రప్రదేశ్‌

ఇంటర్ ‘కార్పొరేట్’లో ఉచిత ప్రవేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలలో 10వ తరగతి వరకు వసతి పొందిన విద్యార్థులు, డేస్కాలర్స్‌గా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివిన విద్యార్థులు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థుల నుండి కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ప్రవేశాల కోసం జ్ఞానభూమి ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని సాంఘిన సంక్షేమశాఖ సంచాలకులు భాస్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయడానికి వార్షికాదాయం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 2 లక్షల లోపు, ఇతరులకు లక్ష లోపు ఉండాలి. విద్యార్థుల తమ దరఖాస్తులను జ్ఞానభూమి వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నిబంధనల ప్రకారం సీట్ల లభ్యత మేరకు వారు కోరుతున్న కళాశాలలకు ప్రాధాన్యతా క్రమంలో ఆన్‌లైన్ సిస్టం ద్వారా సీట్లు కేటాయిస్తారన్నారు. ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం సంవత్సరానికి కళాశాల, వసతి సౌకర్యం కింద రూ. 35 వేలు, విద్యార్థి పాకట్ మనీ కింద రూ. 3 వేలు చెల్లించి ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాలు రెసిడెన్షియల్ విధానంలో ఉచితంగా చదివిస్తుంది. ఈ పథకం కింద ఎస్సీ విద్యార్థులు 1327 మందిని, ఎస్టీలు 604, బీసీలు 738, బీసీ సీ 215, ఈబీసీలు 183, మైనార్టీలు 171 మందిని ఎంపిక చేస్తారు. 2019-20 సంవత్సరానికి గత సంవత్సరం ఎంపిక చేసిన విద్యా సంస్థలోకే విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పథకానికి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఈ నెలాఖరు వరకు స్వీకరిస్తారు. ఎంపికైన విద్యార్థులకు అడ్మిషన్ వివరాలు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేస్తారు. ఎంపికైన విద్యార్థులకు కళాశాల అడ్మిషన్ అలాట్‌మెంట్ అనుమతి పత్రాలు జూన్ 7వ తేదీన అందిస్తారు. ఎంపికైన విద్యార్థులు తమకు కేటాయించబడిన కళాశాలల్లో జూన్ 15వ తేదీలోగా చేరాలి.