ఆంధ్రప్రదేశ్‌

ఏపీ పీసెట్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, మే 15: రాష్టస్థ్రాయిలో బీపీఈడీ, యూజీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 4 నుండి 9 వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీసెట్)-2019 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎస్ విజయరాజు బుధవారం విడుదల చేశారు. రాష్టస్థ్రాయిలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 2631 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 2081 మంది పరీక్షకు హాజరయ్యారు. కోర్సుల్లో ప్రవేశానికి మొత్తం 2001 మంది అర్హత సాధించారని తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో పీసెట్ పరీక్షకు 1349 మంది పరీక్షకు హాజరుకాగా 1299 మంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 704 మంది పరీక్షకు హాజరుకాగా 676 మంది, నాన్‌లోకల్ విభాగంలో 28 మంది పరీక్షకు హాజరుకాగా 26 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
టాప్ ర్యాంకర్లు వీరే
ఏపీ పీసెట్-2019లో మొదటి ఐదు ర్యాంకులు సాధించిన అభ్యర్థుల వివరాలను పీసెట్ కన్వీనర్ ఆచార్య పీపీఎస్ పాల్‌కుమార్ వెల్లడించారు. పీసెట్ పరీక్షలో కర్నూలుకు చెందిన కాసుల హారిక ప్రథమ ర్యాంకు సాధించగా, ప్రకాశం జిల్లాకు చెందిన యల్లావుల రేవతి ద్వితీయ ర్యాంకు సాధించారని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జీ వినీల ప్రియదర్శిని, కేవీ వెంకటరమణ వరుసగా మూడు, నాలుగు ర్యాంకులు సాధించగా, ప్రకాశం జిల్లాకు చెందిన ఉన్నం ప్రదీప్‌కుమార్ ఐదవ ర్యాంకు సాధించారని ఆయన తెలిపారు. పీసెట్‌కు సంబంధించిన ఐదు ర్యాంకులలో మొదటి మూడు ర్యాంకులు మహిళలే సాధించటం విశేషం. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ఆచార్య కోటేశ్వరరావు, వర్సిటీ రెక్టార్ ఆచార్య కే జాన్‌పాల్, రిజిస్ట్రార్ ఆచార్య జీ రోశయ్య, వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పీ జాన్సన్ పాల్గొన్నారు.
చిత్రాలు.. పీసెట్ ఫలితాలను విడుదల చేస్తున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య విజయరాజు
*మొదటి మూడు ర్యాంకులు సాధించిన కాసుల హారిక, యల్లావుల రేవతి, వినీల ప్రియదర్శిని
(ఎడమ నుంచి కుడి)