ఆంధ్రప్రదేశ్‌

ఈసీ పక్షపాత ధోరణి బహిర్గతం: యామినీ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 16: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌కు ఆదేశించడంతో ఎన్నికల సంఘం (ఈసీ) పక్షపాత వైఖరి మరోసారి బహిర్గతమైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడుతూ టీడీపీ ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని ఈసీ.. బీజేపీ, వైసీపీ ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తుండటం పక్షపాత ధోరణికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ పేరును వైసీపీ, బీజేపీ కమిషన్‌గా మార్చుకోవాలని సూచించారు. చంద్రగిరి నియోజకవర్గంతో సహా రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని తాము ఈసీని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. అయితే ఎన్నికలు జరిగిన మూడు వారాల తరువాత వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు అక్రమంగా అడ్డదారులు తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. మైండ్‌గేమ్‌లో భాగంగానే ప్రతిపక్ష నేత జగన్ అమరావతికి మకాం మారుస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని యామినీ శర్మ జోస్యం చెప్పారు.