ఆంధ్రప్రదేశ్‌

వినియోగదారుల రక్షణకే ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసే వారి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకువచ్చిన ‘స్థిరాస్తి నియంత్రణ చట్టం’(రెరా)ను పకడ్బందీగా అమలు చేసేందుకు జూన్ ఆరంభం నుంచి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ రెరా రాష్ట్ర చైర్మన్ వెలమాటి రామనాథ్, సభ్యులు చందు సాంబశివరావు, డాక్టర్ ముళ్లపూడి రేణుక స్పష్టం చేశారు. గురువారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ‘రెరా’ పురోగతిపై పలు అంశాలను వివరించారు. 2017, మే ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం ప్రతి నిర్మాణ సంస్థ కూడా ‘రెరా’లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. దీని వల్ల కొనుగోలుదారులకు ఐదేళ్లపాటు ఈ సంస్థ రక్షణగా నిలుస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో బిల్డర్లు తమ ప్లాన్లకు, నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్, వస్తువులకు ఐదేళ్లపాటు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీని వల్ల కొనుగోలుదారులకు ఐదేళ్లలో ఏదైనా తేడా కన్పిస్తే చట్టరీత్యా ప్రశ్నించే హక్కు లభిస్తుందన్నారు. రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోని సంస్థలకు ఇప్పటికే హెచ్చరిక లేఖలు పంపించామన్నారు. ఇదిలా ఉండగా స్థిరాస్తి లావాదేవీలపై ఇప్పటి వరకు తమకు 196 ఫిర్యాదులు అందాయన్నారు. గత జనవరి ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు నిర్మాణ, అభివృద్ధి అనుమతులు పొంది దరఖాస్తు చేయని స్థిరాస్తి ప్రాజెక్టులపై ఈ నెలాఖరు వరకు ఎలాంటి అపరాధ రుసుం ఉండబోదన్నారు. తరువాత జూన్ 30వ తేదీ వరకు 25 శాతం, జూలై 31వ తేదీ వరకు 50 శాతం, ఆగస్టు మాసాంతం వరకు వంద శాతం అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక రిజిస్ట్రేషన్ పొందని సంస్థలకు భవిష్యత్‌లో బ్యాంక్‌ల నుంచి రుణ సదుపాయం, అలాగే అపార్ట్‌మెంట్‌ల రిజిస్ట్రేషన్‌లు కూడా ఉండబోవని హెచ్చరించారు. ఈ అంశాలన్నింటిపై గత రెండేళ్లుగా తాము విస్తృత ప్రచారం చేశామన్నారు. జరిమానాలు విధించాలన్నది తమ లక్ష్యం కాదని వినియోగదారులకు భరోసా ఇవ్వాలన్నదే ఈ చట్టం ఉద్దేశమన్నారు. కేవలం నియంత్రణ విధులకే పరిమితం కాకుండా భవన నిర్మాణ రంగ అభివృద్ధి కోసం నిర్మాణ రంగంలోని పద్ధతులు, సాంకేతిక ప్రక్రియలతోపాటు వ్యక్తుల నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తున్నామన్నారు. బిల్డర్ల నుంచి తాపీ మేస్ర్తిల వరకు అన్ని స్థాయిల్లో నిర్మాణ రంగ ఉద్యోగులు, ఇతర సాంకేతిక నిపుణులకు సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. భారీ యంత్రాలపై పెట్టుబడి లేకుండా రోజువారీ అద్దె చెల్లించి వాటిని తమ నిర్మాణాలలో ఉపయోగించుకునేలా ఆయా యంత్రాల తయారీదారులతో దేశంలోనే తొలి సారిగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునేలా ఏపీ రెరా ప్రయత్నిస్తున్నదన్నారు. దీని వల్ల నిర్మాణాల వేగం, నాణ్యత పెరగటంతోపాటు డబ్బు ఆదా అవుతుందన్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న టైల్స్, పీవీసీ కిటికీలు, దర్వాజాలు లాంటి అనేక నిర్మాణ సామగ్రిని, విడి భాగాలను ప్రభుత్వమే భారీ ఎత్తున విదేశీ ఉత్పత్తిదారుల నుంచి దిగుమతి చేసుకుని టోకు ధరలలో బిల్డర్లకు అందుబాటులో ఉంచేందుకు ఆయా తయారీ సంస్థలతో తగిన ఒప్పందాలు కుదుర్చుకోటానికి ప్రయత్నిస్తున్నామన్నారు.