ఆంధ్రప్రదేశ్‌

ఆసెట్ పరీక్ష ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 16: ఆంధ్ర విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ,సమీకృత కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, ఆ ఈట్ పరీక్షల ఫలితాలను ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు గురువారం విడుదల చేశారు. ఏయూ అకడమిక్ సెనేట్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ ఆసెట్ ప్రవేశ పరీక్షకు 19,219 మంది దరఖాస్తులు చేశారని, వీరిలో 17,133 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. ఇంజనీరింగ్ కోర్సులకు నిర్వహించిన ఆ ఈట్ పరీక్షలకు 3,191మంది దరఖాస్తు చేయగా 2790 మంది హాజరయ్యారన్నారు. ఈ నెల 9,10 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు రికార్డు సమయంలో ఐదు రోజుల వ్యవధిలోనే ఫలితాలను విడుదల చేశామన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయం(విజయనగరం) సీట్లు సైతం ఆసెట్‌తో భర్తీ చేయడం జరుగుతోందన్నారు. ఆసెట్, ఆ ఈట్ పరీక్షలకు సంబంధించి ర్యాంక్ కార్డులను ఈ నెల 19వ తేదీ నుంచి ఏయూ వెబ్‌సైట్‌లో ఉంచుతామని, ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకూ ప్రత్యేక విభాగాల కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నామని, జూన్ రెండు నుంచి 7వ తేదీ వరకూ విశాఖ, శ్రీకాకుళం, విజయవాడల్లో ఏర్పాటుచేసిన హైల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్ట్ఫికెట్లు పరిశీలన జరుగుతోందన్నారు. విద్యార్థులు జూన్ 3నుంచి 8వ తేదీలోపు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని, తొలిదశ సీట్లు భర్తీ జూన్ 11న వెల్లడిస్తామన్నారు. రెండో దశ కౌనె్సలింగ్ జూన్ 16 నుంచి 18వతేదీ వరకూ జరుగుతుందని, జూల్ 19 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్, ప్రవేశాల సంచాలకుడు ఆచార్య నిమ్మ వెంకటరావు పాల్గొన్నారు.
ఆసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్న ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు