ఆంధ్రప్రదేశ్‌

గాంధీ వారసులు, గాడ్సే వారసుల మధ్య పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: ఈ సారి సార్వత్రిక ఎన్నికలు గాంధీ వారసులకు, గాడ్సే వారసులకు మధ్య జరిగాయని, ఈ ఎన్నికల్లో గాంధీ వారసుల విజయయ తథ్యమని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గాంధీ సిద్ధాంతాలైన సత్యం, అహింస, సత్యాగ్రహం విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు. ఆ మహానీయుని జయంతి రోజు అక్టోబర్ 2వ తేదీ ప్రపంచ అహింసాదినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది గొప్ప నాయకులు గాంధీ సిద్ధాంతంతో ప్రభావితులైనారన్నారు. ఈ ఎన్నికల్లో మోదీ శకం ముగిసి రాహుల్ శకం ప్రారంభమవుతుందన్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీని ఆదరాబాదరాగా ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చారన్నారు. జాతీయ స్థూల ఉత్పత్తి రేటు తగ్గిపోవడం, బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు, వ్యవసాయ రంగ సంక్షోభం, నిరుద్యోగం పెరిగిపోవడం, సాక్షాత్తు ప్రధాని రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంలో కూరుకుపోయారన్నారు. ఈ నెల 23 తర్వాత వివిధ పార్టీల మద్దతులో కాంగ్రెస్ నేతృత్వంలో యుపీఏ 3 ప్రభుత్వం కచ్చితంగా ఏర్పాటవుతుందని శనివారం ఒక ప్రకటనలో తులసిరెడ్డి పేర్కొన్నారు.