ఆంధ్రప్రదేశ్‌

జగన్ కోవర్టు కేవీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను భగ్నం చేయడానికి కొందరు రాజకీయ దళారులు పని చేస్తున్నారని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ హిదాయత్ తెలిపారు. శనివారం ఆయన ఉండవల్లిలోని మీడియా పాయింట్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్యమంత్రి చంద్రబాబు పోషిస్తున్న పాత్రను చూసి ఓర్వలేని కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ ముసుగులో ఉండి, జగన్ కోవర్టుగా మారి బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారని హిదాయత్ ఆక్షేపించారు. ప్రతిపక్షాల కూటమి దేశ వ్యాప్తంగా బలపడుతుంటే, రాహుల్‌గాంధీ, చంద్రబాబు కలిసి పని చేస్తుటే వారి బంధాన్ని బలహీనపరచి, తద్వారా బీజేపీకి మేలు చేయాలన్న దురుద్దేశంతో కేవీపీ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుపడుతూ గవర్నర్‌కు కేవీపీ ఫిర్యాదు చేయడం కూడా అందులో భాగమేనన్నారు. రాష్ట్రానికి చెందిన కేవీపీ కాంగ్రెస్ ముసుగులో ఉండి జగన్‌కు కోవర్టుగా పని చేస్తున్నాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతో పోలవరం నిర్మాణం 70 శాతం వరకు పూర్తయిన వేళ, ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నిర్మాణ పనులను పరిశీలిస్తూ ప్రాజెక్టు పనులు వేగంగా జరిగేలా చంద్రబాబు పని చేస్తుంటనే కేవీపీ ఎందుకు ఓర్వలేకపోతున్నాడో అర్థం కావటం లేదన్నారు.