ఆంధ్రప్రదేశ్‌

మోదీ చేతిలో ఈసీ కీలుబొమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రీపోలింగ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు పక్షపాతంతో దారుణంగా వ్యవహరించాయని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. శనివారం ఆయన ఉండవల్లిలోని మీడియా పాయింట్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని కొన్ని బూత్‌లలో రీ పోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోని ఈసీ, వైసీపీ కోరిన వెంటనే రీ పోలింగ్‌కు సిద్ధమవ్వడంలోని అంతర్యమేమిటో ఎన్నికల అధికారులే సమాధానం చెప్పాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. రాష్ట్ర సీఎస్ సుబ్రహ్మణ్యం తనక సంబంధంలేని విషయాలపై అమితాసక్తి చూపుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడాన్ని ఆయన ఖండించారు. ఒక పార్టీ ఫిర్యాదులపై ఒకలా, మరో పార్టీపై మరోలా వ్యవహరిస్తున్న ఘనత రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనన్నారు. మోదీ ఆడించినట్లుగా భారత ఎన్నికల సంఘం ఆడుతోందని, ఆయన చేతిలో ఈసీ కీలుబొమ్మలా మారిందన్న వైసీబీ, 23వ తేదీ తర్వాత వారి ఆటలు సాగబోవని తేల్చి చెప్పారు.