ఆంధ్రప్రదేశ్‌

కమ్యూనిస్టు ఉద్యమం పునరేకీకరణే తక్షణ కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మే 18: దేశంలో అధికారంలోకి రావాలంటే ఎర్రజెండా పార్టీల ఐక్య ఉద్యమాలతో పాటు కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ అవశ్యమని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కే రామకృష్ణ, పీ మధు ఉద్ఘాటించారు.
సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రస్తుత వ్యవస్థను మార్చడానికి పోరాడుతున్న శక్తులు - ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై గుంటూరులోని ఎన్జీవో హాలులో రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. తొలిరోజు సదస్సుకు హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో అధికారంలోకి రావాలంటే ఎర్రజెండా పార్టీల ఆలోచనా విధానాల్లో మార్పు రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) దేశంలో ఒకేసారి ఆవిర్భవించినా నేడు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఆర్‌ఎస్‌ఎస్ ఎదిగిందన్నారు. కమ్యూనిస్టుల్లాగా ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్య్ర పోరాటంలో గానీ, ప్రజాసమస్యలపై గానీ ఉద్యమించిన దాఖలాలు లేవన్నారు. అన్నివర్గాల సమస్యల పరిష్కారానికి మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలతోనే కమ్యూనిస్టులు పోరాటం చేశారని, అదే సమయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే సిద్ధాంతాలను నిర్లక్ష్యం చేశామన్నారు. కుల వ్యవస్థ, అంటరానితనం ఉండకూడదని ఉద్యమాలు చేసినప్పటికీ ఆ మహనీయుల సిద్ధాంతాలను సమ్మేళనం చేయలేకపోయామన్నారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్, పూలే సిద్ధాంతాలను మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలతో సమ్మిళితం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలో నేడు అన్ని రంగాల్లో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం పెరిగిందని, మత ఎజెండాను ప్రజలపై రుద్దేందుకు ఆ శక్తులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ తరుణంలో ప్రజలు చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర, ప్రత్యామ్నాయ శక్తుల పునరుద్ధరణకు కృషిచేయాలన్నారు. దేశంలో రెండు దశాబ్దాల అనంతరం కమ్యూనిస్టు ఉద్యమం కోలుకుని బలపడుతోందని, ఈ ఉద్యమం గతం కంటే వేగంగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు.
2007లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం నేడు అనేక దేశాల్లో కొనసాగుతుందన్నారు. దేశంలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, నూతన ఆర్థిక సరళీకరణ విధానాలు, ప్రజాస్వామ్యవాదమే ఇందుకు కారణమన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో చేసిన తప్పులను సమీక్షించుకుంటూ, కమ్యూనిస్టు పార్టీల ఎజెండాలు ఒక్కటే అయినప్పటికీ, సిద్ధాంతాల పరంగా తేడాలు ఉన్నాయని వీటిని సరిదిద్దుకుంటూ ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకురాలు ఎస్ జాన్సీ, రాష్ట్ర నాయకులు ఎంఎస్ నాగరాజు, సి పెద్దన్న, గణేష్‌పాండే, అమర్‌నాధ్ తదితరులు పాల్గొన్నారు.