ఆంధ్రప్రదేశ్‌

పాడుబడ్డ బావిలో పడిన అడవి దున్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, మే 19: కర్నాటక ప్రాంతంలోని అడవుల నుంచి దారితప్పి వచ్చిన అడవిదున్న ఒకటి అనంతపురం జిల్లాలో పాడుపడ్డ బావిలో పడింది. దీన్ని బయటకు తీసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం ఎంసి.పల్లి గ్రామ సమీపంలోని పాడుబడ్డ బావిలో అడవి దున్న పడింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా కనిపించే అడవిదున్న అని పశు వైద్యఅధికారులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం గ్రామంలోకి వచ్చిన అడవి దున్నను గ్రామస్తులు తరమడంతో అది చెట్ల చాటున ఉన్న పాడుబడ్డ బావిలో పడింది. దున్నను బయటకు తీసేందుకు అటవీశాఖ అధికారులు ఆదివారం ఉదయం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. బావిని ఓవైపు పూడ్చి దున్నను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. తిరుపతి జంతు ప్రదర్శనశాల అధికారులకు సమాచారం అందించారు.