ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ మీటర్లతో విద్యుత్ అక్రమాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: అదనపు విద్యుత్ వాడినా, వృథా చేసినా, ఏవిధమైన అక్రమాలకు పాల్పడినా సులభంగా తెలుసుకోగలిగే అత్యాధునిక స్మార్ట్‌మీటర్లను ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) యాజమాన్యం అందుబాటులోకి వచ్చింది. పాత కరెంటు మీటర్ల స్థానంలో దశలవారీగా వీటిని మార్పు చేస్తున్న సంస్థ విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్ తొలగించాలని నిర్ణయించింది. ముఖ్యంగా స్మార్ట్‌మీటర్ల వాడకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే లోపాలు బయటకొస్తాయి. మూడు కిలోవాట్లకుగాను ఆరు కిలోవాట్ల విద్యుత్‌ను వాటితే వీటిద్వారా తెలిసిపోతుంది. అందువల్ల అక్రమాలను సులభంగా పసిగట్టే స్మార్ట్‌మీటర్ల మార్చే కార్యక్రమాన్ని తొలుత విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, భీమవరం ముఖ్య పట్టణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది.
ఇక నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోకి వచ్చే మరికొన్ని చిన్న పట్టణాలు, మండల కేంద్రాలు, తరువాత గ్రామీణ ప్రాంతాలకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు పూర్తిస్థాయిలో విస్తరించాలని నిర్ణయించింది. తొలుత కేవలం 10నుంచి 20 శాతం మేర స్మార్ట్ మీటర్ల మార్పును పూర్తిచేయగా, క్రమేపీ దీనిని 50 నుంచి 60 శాతానికి తీసుకువెళ్ళాలని నిర్ణయించింది. సంస్థ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 58 లక్షల మేర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరగనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఒకవైపు కాలం చెల్లిన, ఎక్కువగా వాడే వాటిని, సాంకేతికపరమైన సమస్యలతో మరమ్మతులకు నోచుకునే వాటిని గుర్తించి అటువంటి వాటి స్థానంలో స్మార్ట్‌మీటర్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈవిధంగా ఏర్పాటైన స్మార్ట్‌మీటర్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉన్నందున ఎటువంటి పరిస్థితుల్లోనూ లోపాలకే అవకాశం ఉండదని సంబంధితాధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రధానంగా ఇంటిలో విద్యుత్ వాడకం అదనంగా ఉన్నా, బిల్లులు చెల్లించకపోయినా సులభంగా తెలిసిపోతుందన్నారు. వీటి ఖర్చు సంస్థే భరిస్తుందని, వినియోగదారులపై భారం మోపే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికే అత్యంత కాంతివంతమైన, పర్యావరణాన్ని పరిరక్షించే, విద్యుత్ వాడకం తగ్గించుకునే ఎల్‌ఇడీ బల్బుల వాడకాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి ఫలితాలు సాధించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైందని, పట్టణ ప్రాంతాల్లో వీధి దీపాలు, ప్రభుత్వ కార్యాలయాలు, చివరకు గృహ వినియోగంలో ఇవి అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎల్‌ఇడీ బల్బుల తరువాత స్మార్ట్‌మీటర్ల వలన మరిన్ని ఫలితాలను సాధిస్తామని అధికారులు అంటున్నారు.