ఆంధ్రప్రదేశ్‌

తోటపల్లి ప్రాజెక్టు పరిశీలనకు కేంద్ర జలవనరుల బృందం నేడు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరుగుబిల్లి, మే 19: విజయనగరం జిల్లా గరుగుబిల్లి ప్రాంతంలో ఉన్న తోటపల్లి రిజర్వాయర్ అభివృద్ధి, నిర్మాణ పనుల పరిశీలనకు కేంద్ర జలవనరుల విభాగ అధికారుల బృందం సోమవారం వస్తోంది. తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ. 450 కోట్లతో అంచనాలు తయారు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తికి కేంద్రం వాటాగా 75శాతం, రాష్ట్రం వాటాగా 25శాతం ఖర్చు చేయాలని అప్పట్లో ప్రతిపాదనలు తయారుచేశారు. తదుపరి కేంద్రం వాటాగా 60శాతం, రాష్ట్రం వాటాగా 40శాతానికి తగ్గించి అంచనాల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం 90శాతం మేర ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయి.తుది దశకు చేరుకున్న అభివృద్ధి, నిర్మాణ పనుల పరిశీలనకు కేంద్ర బృందం సోమవారం వస్తోందని ప్రాజెక్టు జిల్లా ఇంజనీరింగ్ అధికారులు తెలియజేశారు. తుది దశగా కేంద్రం నుండి సుమారు ఆరు కోట్ల రూపాయలు నిధులు రావాల్సి ఉంది. ఈ మేరకు పలుసార్లు జిల్లా అధికారులు కేంద్ర జలవనరుల సంఘానికి మిగతా నిధుల కోసం నివేదికలు అందించారు. దీంతో ప్రాజెక్టును పరిశీలించేందుకు కేంద్ర జనవనరుల సంఘం ప్రతినిధులు రానున్నారని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. తుది పరిశీలనలోప్రాజెక్టు పనుల నిర్మాణంలో నాణ్యత, డిజైన్లు, ఇతరత్రా పనులను పరిశీలిస్తారని అంటున్నారు.