రాష్ట్రీయం

వేసవి రద్దీకి అనుగుణంగా టీటీడీ సేవలు విస్తృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 19: వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మరింత విస్తృతంగా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ తిరుమల ఇన్‌చార్జి జేఈఓ లక్ష్మీకాంతం తెలిపారు. తిరుమలలో ఆదివారం జేఈఓ అధికారులతో కలసి కళ్యాణి విశ్రాంతి భవనం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు తిరుమలలోని పలు ప్రాంతాల్లోని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ఈనెల 18న 93,044 మంది శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. 19వ తేదీన లక్ష మందికిపైగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, విజిలెన్స్, శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సమన్వయంతో పనిచేసి 11 నుండి 18వ తేదీ వరకు 6.77 లక్షల మంది భక్తులకు సంతృప్తికరమైన దర్శనాన్ని కల్పించామన్నారు. శ్రీవారి ఆలయంలో అధికారులు, సిబ్బంది భక్తులకు అసౌకర్యం కలగకుండా వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు క్యూ లైన్లను క్రమబద్ధీకరించారన్నారు. తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రధాన కళ్యాణకట్టతో పాటు మినీ కళ్యాణకట్టల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి 24 గంటలు సేవలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. తిరుమలలో బస కల్పించేందుకు విశ్రాంతి భవనాల్లోని గదుల వివరాలను ఎప్పటికప్పుడు టీటీడీ రేడియో, బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా భక్తులకు తెలియజేస్తున్నామన్నారు. భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను అందుబాటులో ఉంచామన్నారు. దాదాపు మూడువేల మంది శ్రీవారి సేవకులు నారాయణగిరి ఉద్యానవనాల్లోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లు, వైకుంఠం 1,2 కంపార్టుమెంట్లలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలను నిరంతరం పంపిణీ చేస్తున్నారని చెప్పారు.
అదేవిధంగా శ్రీవారి సేవకులు క్యూలైన్ల నిర్వహణ, లడ్డూ ప్రసాదాలు పంపిణీ, పరకామణి తదితర విభాగాల్లో సేవలందిస్తున్నారన్నారు. తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. టీటీడీ ఇంజనీరింగ్, నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన భద్రత కల్పించడంతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టామన్నారు. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు లక్షలాదిగా విచ్చేసే భక్తులకు భద్రత, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, వైద్యం, ఐటీ, రవాణా విభాగం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించి విస్తృత ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ2 రామచంద్రారెడ్డి, ఆరోగ్య విభాగం అధికారిణి డాక్టర్ శర్మిష్ట, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి వేణుగోపాల్, ఆర్‌ఓ1 దిప్యూటీ ఈఓ బాలాజీ, విఎస్‌ఓ మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం...తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న తిరుమల ఇన్‌చార్జి జేఈఓ లక్ష్మీకాంతం