ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన అమ్మవారి వసంతోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 19: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు ఆదివారం వేడుకగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చన, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు అన్నమచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగిశాయి. ఈకార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, ఏఈఓ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.