ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: ఆర్టీసీలో అపరిష్కృత డిమాండ్‌ల సాధనకై ఈ నెల 8వ తేదీ జారీ చేసిన సమ్మె నోటీసుకు మద్దతుగా కార్మికులను సన్నద్ధం చేసేందుకు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోల్లో సోమవారం సామూహిక ధర్నాలు జరిగాయి. మంగళవారం కూడా ధర్నాలు జరగనున్నాయి. ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించాలని, సిబ్బంది కుదింపు చర్యలను విరమించుకోవాలని ఎన్‌ఎంయు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై శ్రీనివాసరావు, ముఖ్య ఉపాధ్యక్షులు డీ సూర్య ప్రకాశరావు డిమాండ్ చేశారు.
22న ఆర్‌ఎం కార్యాలయాల ముట్టడి
గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ జారీ చేసిన సమ్మె నోటీసుకు మద్దతుగా ఈ నెల 22వ తేదీ జరిగే 13 జిల్లాల రీజనల్ మేనేజర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. సమ్మె ఆరంభమైతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.