ఆంధ్రప్రదేశ్‌

పశు సంపదను దేశ సంపదగా గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: పశువులను సంపదగా భావించిన సంస్కృతి భారతీయుల సొంతమని అలాంటి పశుసంపదను సంరక్షించి ప్రోత్సహించేందుకు రైతులు ముందుకు రావాలని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని ఆత్కూరు స్వర్ణ్భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం ప్రారంభోత్సవం, ఒంగోలు జాతి పశువులపై పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పశుసంపదను దేశ సంపదగా గుర్తించాలన్నారు. పశుపోషణను ఒక వృత్తిగా స్వీకరించేలా అది సేద్యానికి ఆదరువు ఇచ్చేలా ఉంటుందన్న భావన రైతుల్లో బలపడాలన్నారు. ఇందుకోసం పశుసంవర్థక, వ్యవసాయ, ఉద్యాన, అటవీ శాఖల మధ్య సమన్వయం పెరగాలని ఆకాంక్షించారు. అన్నదాతలకు వెన్నుదన్నుగా పశుసంపద నిలుస్తుందన్నారు. పశుసంపదను నమ్ముకున్న వారు ఆత్మహత్యలు చేసుకోలేదని, పాడి - పంట రెండు కళ్లు వంటివన్నారు. 15 ఏళ్లకుపైగా శ్రమించి 300కు పైగా ఛాయాచిత్రాలతో, 13 పుస్తకాలు, 80 పరిశోధన అంశాల నుంచి సమాచారం సేకరించి పూర్తి చేసిన 1200 పేజీల ఒంగోలు జాతి పశువుల కంపెన్‌డియం పుస్తకాన్ని తీర్చిదిద్దిన ముల్లపూడి నరేంద్రనాథ్‌కు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. భారతదేశం నుంచి 1960లో బ్రెజిల్ దేశం 20 పశువులను, 1962లో 84 పశువులను దిగుమతి చేసుకుందన్నారు. కేవలం 104 పశువులను తీసుకువెళ్లిన బ్రెజిల్ లక్షల సంఖ్యలో స్వచ్ఛమైన హైబ్రిడ్ ఒంగోలు జాతి పశువులను పునరుత్పత్తి చేసి లబ్ధి పొందుతుంటే మన దేశంలో పుట్టిన ఒంగోలు జాతి అభివృద్ది ఆశించిన స్థాయిలో లేదన్నారు.
ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
ఆర్థిక శక్తితోపాటు ఆరోగ్య శక్తిని కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా వెంకయ్య నాయుడు తెలిపారు. స్వర్ణ్భారతి ట్రస్ట్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణకు ముందుకు వచ్చిన ఆయూష్ ఆసుపత్రి, రెయిన్‌బో ఆసుపత్రి, శంకర్ నేత్రాలయ వారికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. సమాజంలో ఏ ఒక్కరికి ఆసుపత్రి అవసరం రాకూడదన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. ఇలాఉంటే వ్యవసాయ రంగంలో చేసిన కృషికి ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న యడ్లపల్లి వెంకటేశ్వరరావును ఉప రాష్టప్రతి సత్కరించారు. స్వర్ణ్భారతి ట్రస్ట్ తరపున వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందిన 127 మంది యువతీ యువకులకు సర్ట్ఫికెట్లు బహూకరణ చేశారు. వీరికి స్నైడైర్ జర్మనీ కంపెనీ ప్రతినిధుల ప్రోత్సాహంతో వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో స్వర్ణ్భారతి ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస్, స్వర్ణ్భారతి ట్రస్ట్ విజయవాడ చాప్టర్ సెక్రటరీ సీహెచ్‌ఆర్కే ప్రసాద్, ఆయూష్ ఆసుపత్రి చైర్మన్ యార్లగడ్డ రమేష్‌బాబు, రెయిన్‌బో ఆసుపత్రి చైర్మన్ కే రమేష్, ఒంగోలు జాతి పశువుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ముళ్లపూడి నరేంద్రనాథ్, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఏపీఎస్‌ఎస్‌బీసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఏ శ్రీ కాంత్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు