ఆంధ్రప్రదేశ్‌

పోలింగ్ సిబ్బందిపై చర్యలు అనైతికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మే 21: ఎన్నికల నిర్వహణలో జరిగిన పొరపాట్లకు కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేయడం అనైతికమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విరెడ్డి శేఖరరెడ్డి, కే వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం దారుణమని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌కు కారణమంటూ పది మంది ఉపాధ్యాయులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో నిబద్ధతతో పని చేశారన్నారు. ఇటువంటి చర్యల వల్ల ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందన్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ జరిగిందన్నారు. కింది స్థాయి అధికారులు ఇచ్చిన నివేదికను పట్టించుకుని దళితులు, గిరిజనులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉంటే రీపోలింగ్ సమస్యే వచ్చేది కాదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం తెలియజేయనున్నట్లు వారు తెలిపారు. పది మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్ ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.