ఆంధ్రప్రదేశ్‌

బాబు విజయం కోసం సుదర్శన హోమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 22: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తిరిగి పగ్గాలు చేపట్టాలని కోరుకుంటూ గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) ఛైర్మన్ గన్ని కృష్ణ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో లక్ష్మీగణపతి సహిత సుదర్శన హోమం నిర్వహించారు. జన బలానికి దైవాఆశీస్సులు తోడై సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించి చంద్రబాబునాయుడు మళ్ళీ సీఎం కావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ హోమం నిర్వహించారు. స్థానిక శ్రీరామనగర్‌లోని గన్ని కృష్ణ నివాసం సమీపంలోని శ్రీ వేంకట హరవర సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నిర్వహించిన ఈ హోమం క్రతువును తిలకించడానికి భక్తులతో పాటు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
గణపతికి ప్రీతికరమైన సంకష్టహర చతుర్ధి కూడా ఈ రోజు కావడంతో ఈ హోమం నిర్వహణ ఎంతో విశిష్టమైందని పండితులు పేర్కొన్నారు. మూడు గంటల పాటు సాగిన ఈ హోమాన్ని గన్ని కృష్ణ, రాజేశ్వరి దంపతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాజమహేంద్రవరం టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం ఎమ్మెల్యేలు, అభ్యర్థులైన గోరంట్ల బుచ్చయయ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ అభ్యర్థి ఆదిరెడ్డి భవాని హాజరై ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ యర్రా వేణుగోపాల రాయుడు, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి మణి, కార్పొరేటర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా రాజమహేంద్రవరంలోని మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ అభ్యర్థులు అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు జరపడం విశేషం.