ఆంధ్రప్రదేశ్‌

అందరి చూపూ కడప జిల్లా వైపే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 22: రాష్టవ్య్రాప్తంగా అందరి చూపు ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లాపైనే ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జిల్లావాసి కావడంతో ప్రజలందరి దృష్టి ఇక్కడే ఉంది. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి జగన్ పోటీ చేస్తున్నారు. పులివెందులలో జగన్ సాధించే మెజార్టీపై ఇప్పటికే భారీగా బెట్టింగ్‌లు జరిగాయి. జిల్లాలో పార్టీకి వచ్చే సీట్ల సంఖ్యపై కూడా రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. జిల్లాలోని పది శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్య పోటీ కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ, జనసేన అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. వీరితో పాటు కడప పార్లమెంట్‌కు సీపీఐ అభ్యర్థి బరిలో నిలిచారు. కడప అసెంబ్లీ నియోజకవర్గానికి రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ అభ్యర్థి బరిలో నిలిచారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు కడప పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. తక్కిన రాయచోటి, రాజంపేట, కోడూరు నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు కలిపి రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. జిల్లాలో 22,04,964 మంది ఓటర్లు ఉండగా గత నెల 11న 17,02,981 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.23 శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువే. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, వీరాభిమానులు బుధవారం సాయంత్రానికే నగరానికి చేరుకున్నారు. నగరంలోని లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌లు, పార్టీ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి.