ఆంధ్రప్రదేశ్‌

గోదావరి జిల్లాల్లో వైకాపా ప్రభంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 23: గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకుగాను 26 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక ఐదు లోక్‌సభ స్థానాలనూ గంపగుత్తగా తన ఖాతాలో వేసేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాలకుగాను పెద్దాపురం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, మండపేటలో టీడీపీ విజయం సాధించింది. రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 స్థానాలకు గాను పాలకొల్లు, ఉండి, స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలుపొందారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం లోక్‌సభ స్థానాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
2014 ఎన్నికలతో పోలిస్తే రెండు జిల్లాల్లోనూ ఓటర్లు పూర్తి భిన్నమైన తీర్పునిచ్చారు. గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు స్థానాల్లో మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించింది. మిగిలిన 14 స్థానాలతో పాటు మూడు లోక్‌సభ స్థానాలను టీడీపీ గెల్చుకుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలు గెల్చుకోగా, ఒక స్థానంలో జనసేన విజయం సాధించింది. మిగిలిన 14 స్థానాలతో పాటు మూడు లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. మొత్తం 15 శాసనసభ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలను తెలుగుదేశం-బీజేపీ కూటమి గెల్చుకుంది. ప్రస్తుతం చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా కేవలం రెండు స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మిగిలిన 13 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది.
తూర్పు గోదావరి జిల్లాలో: కాకినాడ:వంగా గీత (వైసీపీ), రాజమహేంద్రవరం:మార్గాని భరత్ (వైసీపీ), అమలాపురం:చింతా అనురాధ (వైసీపీ)
19 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికైన వారు: కాకినాడ సిటీ: ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (వైసీపీ), కాకినాడ రూరల్: కురసాల కన్నబాబు (వైసీపీ), తుని:దాడిశెట్టి రాజా (వైసీపీ) పెద్దాపురం: నిమ్మకాయల చినరాజప్ప (టీడీపీ), జగ్గంపేట: జ్యోతుల చంటిబాబు (వైసీపీ), ప్రత్తిపాడు:పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ (వైసీపీ), పిఠాపురం:పెండెం దొరబాబు (వైసీపీ), రాజమహేంద్రవరం సిటీ:ఆదిరెడ్డి భవానీ (టీడీపీ), రాజమహేంద్రవరం రూరల్:గోరంట్ల బుచ్చయ్యచౌదరి (టీడీపీ), రాజానగరం:జక్కంపూడి రాజా (వైసీపీ), అనపర్తి:సత్తి సూర్యనారాయణ రెడ్డి (వైసీపీ), అమలాపురం:పినిపే విశ్వరూప్ (వైసీపీ), రామచంద్రపురం: చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (వైసీపీ), మండపేట: వేగుళ్ల జోగేశ్వరరావు (టీడీపీ), ముమ్మిడివరం: పొన్నాడ వెంకట సతీష్ (వైసీపీ), కొత్తపేట:చిర్ల జగ్గిరెడ్డి (వైసీపీ), పి.గన్నవరం:కొండేటి చిట్టిబాబు (వైసీపీ), రాజోలు: రాపాక వరప్రసాదరావు (జనసేన), రంపచోడవరం: నాగులాపల్లి ధనలక్ష్మి (వైసీపీ)
పశ్చిమ గోదావరి జిల్లాలో: ఏలూరు:కోటగిరి శ్రీ్ధర్ (వైసీపీ), నరసాపురం:కెఆర్‌ఆర్‌కెరాజు (వైసీపీ)
15 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికైన వారు: ఏలూరు: ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) (వైసీపీ), దెందులూరు:కొఠారు అబ్బయ్యచౌదరి (వైసీపీ), ఉంగుటూరు:పుప్పాల శ్రీనివాసరావు (వైసీపీ), చింతలపూడి: వీఆర్ ఎలీజా (వైసీపీ), కొవ్వూరు:తానేటి వనిత (వైసీపీ), గోపాలపురం:తలారి వెంకట్రావు (వైసీపీ), తణుకు:కారుమూరి నాగేశ్వరరావు (వైసీపీ), నిడదవోలు:జి శ్రీనివాసనాయుడు (వైసీపీ), తాడేపల్లిగూడెం:కొట్టు సత్యనారాయణ (వైసీపీ), నరసాపురం:ముదునూరి ప్రసాదరాజు (వైసీపీ), భీమవరం:గ్రంధి శ్రీనివాస్ (వైసీపీ), పాలకొల్లు:నిమ్మల రామానాయుడు (టీడీపీ), ఆచంట:చెరుకువాడ శ్రీరంగనాథరాజు (వైసీపీ), ఉండి:మంతెన రామరాజు (టీడీపీ), పోలవరం: తెల్లం బాలరాజు (వైసీపీ).