ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ క్లీన్ స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 23: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ మొత్తం పది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని క్లీన్‌స్వీప్ చేసింది. ఇద్దరు మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. సూళ్లూరుపేట వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య తన సమీప టీడీపీ ప్రత్యర్థి పరసా రత్నంపై సుమారు 56వేల మెజార్టీ సాధించి జిల్లాలో రికార్డు నెలకొల్పారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో మాత్రం గెలుపు రెండు పార్టీల నడుమ దోబూచులాడింది. చివరకు వైసీపీ అభ్యర్థి పి.అనిల్‌కుమార్‌యాదవ్ తన ప్రత్యర్థి సుమారు 2వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. వెంకటగిరి నుండి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై 37వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై సర్వేపల్లి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి 13,866 ఓట్ల తేడాతో గెలుపొందారు. వైసీపీ గెలుపుతో జిల్లా అంతటా ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.