ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో ఎదురలేని వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 23: నిన్నటి విపక్ష వైసీపీ సునామీ సృష్టించింది. ఓట్ల సాధనలో జగన్ ముఖవర్చస్సు వైసీపీ అభ్యర్థులను ఘన విజయాల బాట పట్టించింది. విశాఖ ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో తమకు ఎదురేలేదన్న రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 11 సీట్లను గెలుచుకుని విజయపతాక ఎగురవేసింది. గతంతో పోలిస్తే నాలుగు రెట్లు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో అత్యధిక స్థానాల్లో తొలి రౌండ్ నుంచి వైసీపీ ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. అర్బన్ పరిధిలోని ఒకటి, రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ వైసీపీ జైత్రయాత్ర కొనసాగింది. వైసీపీ ఓట్ల సునామీలో టీడీపీకి చెందిన సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఘోర పరాజయాన్ని చవిచూడగా, మరో యువ మంత్రి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం. అర్బన్ పరిధిలోని మరో మంత్రి గంటా శ్రీనివాసరావు చివరి నిముషం వరకూ జయాపజయాల నడుమ నెట్టుకొచ్చి చివరకు 1800 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గట్టెక్కారు. అయితే గంటా గెలుపుపై వైసీపీ అభ్యర్థి కేకే రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ సందర్భంగా మొరాయించిన నాలుగు ఈవీఎంలతో పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపును పూర్తి చేయలేదంటూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భాస్కర్ హుటాహుటిన వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు. మొరాయించిన ఈవీఎంలను లెక్కించడంతో పాటు పోస్టల్, సర్వీసు ఓట్లను కౌంటింగ్‌లో చేర్చాలంటూ ఆదేశించారు. ఇక రూరల్ జిల్లా పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఏజెన్సీలోని రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక్కడ పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు (మాడుగుల) సహా మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు(పాయకరావుపేట), కరణం ధర్మశ్రీ (చోడవరం), ఘన విజయం సాధించగా, మరో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు (యలమంచిలి) విజయానికి చేరువలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన గుడివాడ అమర్‌నాథ్ (అనకాపల్లి), పీ ఉమాశంకర్ గణేష్ (నర్సీపట్నం), తిప్పల నాగిరెడ్డి (గాజువాక)తో పాటు కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన శెట్టి ఫల్గుణ (అరకు), కే భాగ్యలక్ష్మి (పాడేరు), అన్నంరెడ్డి అదీప్ రాజ్ (పెందుర్తి), సిట్టింగ్ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (్భమిలి) ఘన విజయం సాధించారు.
నగరంలో నీరసించి.. స్పీడు తగ్గిన ఫ్యాన్
జిల్లాను క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ నగరంలో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. నగరంలోని విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తర నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ విజయకేతనం ఏగురవేసింది. విశాఖ తూర్పు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పశ్చిమం నుంచి గణబాబు, విశాఖ దక్షిణ నుంచి వాసుపల్లి గణేష్‌కుమార్ సహా విశాఖ ఉత్తర నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు.