ఆంధ్రప్రదేశ్‌

మంత్రి ఆదికి ఊహించని ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 23: కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన టీడీపీ నేతలకు ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఎంపీగా పోటీచేసిన మంత్రి ఆదినారాయణ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారి మంత్రి పదవి చేపట్టిన సీ.ఆదినారాయణరెడ్డికి ఈ ఎన్నికల్లో ఊహించని ఓటమి ఎదురైంది. రాష్టవ్య్రాప్తంగా ప్రజలందరికీ ఆసక్తివున్న నియోజకవర్గాల్లో జమ్మలమడుగు నియోజకవర్గం ఒకటి. ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుండి జిల్లాలో పార్టీపై పూర్తి పట్టు బిగించారు. స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించడంలో ఆదినారాయణరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపి విజయం సాధించారు. అప్పటి నుండి ఆదినారాయణరెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీలోనే కాకుండా రాష్టస్థ్రాయిలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఎదిగారు. కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే గాకుండా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో తన అభిప్రాయం తప్పనిసరి అన్న స్థాయికి ఎదిగారు. కడప పార్లమెంట్ స్థానం నుండి వైఎస్ కుటుంబీకులను ఎదుర్కొనేందుకు ఏకైక వ్యక్తి ఆదినారాయణరెడ్డేననే అభిప్రాయంతో, చంద్రబాబునాయుడు ఆయన్ను ఎంపీ స్థానానికి పోటీ చేయాలని స్వయంగా కోరారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు మూడు తరాలుగా చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న కుటుంబాల నుండి వచ్చిన సీ.ఆదినారాయణరెడ్డి, పీ.రామసుబ్బారెడ్డి ఇద్దరూ ఈ ఎన్నికల్లో కలిసి పనిచేశారు. రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నుంచి అసెంబ్లీకి పోటీచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున యువకుడైన డా.మూలె సుధీర్‌రెడ్డి బరిలో నిలిచారు. సుధీర్‌రెడ్డి రాజకీయ కుటుంబం నుండే వచ్చినా , ఆయన కుటుంబంలో అందరూ ఆయనకు అండగా నిలవలేదు. తొలిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీపడ్డారు.
జమ్మలమడుగులో సుధీర్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసిన సమయంలో ఆయన గెలుస్తారని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత ప్రచార సమయంలో రోజురోజుకు వైఎస్ జగన్ ప్రభంజనం అధికం కావడం, జమ్మలమడుగులోని సీనియర్ రాజకీయ నేతలిద్దరిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి సుధీర్‌రెడ్డికి కలిసొచ్చాయి. ఆయన గెలవవచ్చుననే అభిప్రాయం క్రమంగా బలపడింది. అయితే ఎవరూ ఊహించని విధంగా దాదాపు 52 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో సుధీర్‌రెడ్డి పి.రామసుబ్బారెడ్డిపై గెలుపొందడం అందర్నీ ఆశ్చర్యపరచింది.