ఆంధ్రప్రదేశ్‌

భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 23: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పశ్చిమ గోదావరి జిల్లాలో చేదు అనుభవం మిగిలింది. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసిన ఆయన గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఓటమి చెందారు. ఈ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్‌ను ఓడించడం ద్వారా వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ సంచలనం సృష్టించారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఆకస్మికంగా భీమవరం జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది. దీనితో ఇక్కడ పోరు రసకందాయంగా మారింది. టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పోటీచేశారు. అయితే అనూహ్య రీతిలో జనసేన అభ్యర్థిగా పోటీచేసిన పవన్ కళ్యాణ్ ఓటమి చెందారు. అయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌పై సుమారు ఏడువేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పొందారు. కాగా జిల్లాలోని నరసాపురం లోక్‌సభ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సైతం పరాజయం పాలయ్యారు. ఈ పరాజయాలతో మెగాబ్రదర్స్‌కు సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. భీమవరం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్, నరసాపురం లోక్‌సభకు నాగబాబు పోటీ చేసి ఓటమిచెందారు.
చిత్రం... పవన్ కళ్యాణ్‌పై విజయం సాధించిన గ్రంధి శ్రీనివాస్